top of page

Events

Stay tuned for our upcoming events and join us in celebrating our community's heritage, fostering connections, and creating lasting memories together.

Srimad Bhagavatham Pravachanalu

12 December 2025

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితిలో 11.12.2025 బుధవారం నుండి 21.12.2025 ఆదివారం వరకు ఉత్తర కాశీ నివాసి అయిన ప్రవచన కర్త శ్రీ శ్రీ శ్రీ విభూ చైతన్య (హేమంత్ గారు) గారిచే శ్రీ మద్భాగవత ప్రవచనముల కార్యక్రమము జరిగినది. ప్రతి రోజు 300 మందికి పైగా భక్తులు హాజరయి ఎంతో భక్తి శ్రద్దలతో ప్రవచనములు వినడం జరిగినది. శ్రీమతి మంతెన పద్మ గారు ( కోడవల్లి పద్మ గారు) మరియు శ్రీమతి పెన్మెత్స సుజాత గారు ( MLA శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారి సతీమణి ) కలసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. ప్రవచనాలకు హాజరైన భక్తులందరికీ మధ్యాహ్నం చక్కని భోజనం సాయంత్రం ప్రసాదం ఇవ్వడం జరిగినది. 11వ తేదీ ఉదయం 10.00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమైనది. సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు శ్రీ విభూ చైతన్య గారి గురించి అయన గొప్పతనం గురించి అందరికి తెలియజేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించడం జరిగినది. సమితి ఉపాధ్యక్షులు శ్రీ S.S.N. రాజు గారు విభూ చైతన్య గారికి కండువా వేసి ఆహ్వానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ MLA శ్రీ P. విష్ణుకుమార్ రాజు గారు శాలువా వేసి, దండ వేసి, పండ్ల సజ్జను సమర్పించి ప్రవచనములను ప్రారంభించవలసినదిగా కోరినారు. సమితి మాజీ అధ్యక్షులు శ్రీ A.S.N. రాజు గారు, శ్రీ మంతెన సతీష్ వర్మ గారు పుష్ప గుచ్చాలను ఇవ్వడం జరిగినది. 11 వ తేదీన ప్రారంభించి 21 వ తేదీ వరకు కూడ ఆధ్యంతం శ్రీ విభూ చైతన్య గారు శ్రీ మద్భాగవతాన్ని ఎంతో చక్కగా, భక్తులకు ఆసక్తి కలిగించేలా ఆధ్యాత్మిక అంశాలకు చక్కని ఉదాహరణలను జోడించి అందరిని ఆకట్టుకునేలా వివరించి ప్రవచనములను చెప్పడం జరిగినది. 21వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు ముగింపు కార్యక్రమం జరిగినది. ఈ సందర్బంగా సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు మాట్లాడుతూ.. 11 రోజులపాటు క్షత్రియ సంక్షేమ సమితిలో శ్రీ మద్భాగవత ప్రవచనాలను చెప్పడం ద్వారా ఆధ్యాత్మిక సౌరభాలను గుభాళించి అందరినీ భక్తి పారవశ్యులను చేసిన శ్రీ విభూ చైతన్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసి భక్తి శ్రద్దలతో శ్రీ మద్భాగవత ప్రవచనాలను ఆలకించి ఆధ్యాత్మిక భావన పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తులందరికీ క్షత్రియ సంక్షేమ సమితి తరపున మరియు శ్రీమతి మంతెన పద్మ గారు శ్రీమతి పి సుజాత గార్ల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అని అన్నారు. తర్వాత శ్రీ విభూ చైతన్య గారికి చిరు సత్కారం చేయడం జరిగినది. క్షత్రియ సంక్షేమ సమితి వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ S.S.N రాజు గారు మరియు బుద్ధరాజు శివాజీ గారు శ్రీ విభూ చైతన్య గారికి శాలువా కప్పి సత్కరించారు. జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V. జానకిరామ రాజు గారు, శ్రీ KVBS నాగరాజు గారు, ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు వారికి శ్రీ కృష్ణ భగవానుడి చిత్రపటాన్ని బహుకరించారు. సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు ఫ్రూట్ బాస్కెట్ ను సమర్పించగా డైరెక్టర్ శ్రీ K మురళీకృష్ణం రాజు గారు మాల వేశారు. అనంతరం సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు మాట్లాడుతూ.. ఈ మహోన్నత కార్యక్రమాన్ని మన క్షత్రియ కళ్యాణమండపంలో నిర్వహించ తలపెట్టి వారి స్వంత ఖర్చులతో వచ్చిన భక్తులందరికీ భోజన సదుపాయంతో సహా ఇతరత్రా సదుపాయాలు సమకూర్చి ఎంతో భక్తి శ్రద్దలతో దిగ్విజయంగా నిర్వహించి ఈ కల్యాణ మండపానికి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుని వచ్చి మన క్షత్రియ సంక్షేమ సమితి ప్రతిష్టను మరో మెట్టు ఎక్కించినటువంటి శ్రీమతి మంతెన పద్మ గారికి, శ్రీమతి పెన్మెత్స సుజాత గారికి క్షత్రియ సంక్షేమ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికీ వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్యకార్యాలు నిర్వహించడానికి శక్తీ సామర్ధ్యాలు ప్రసాదించాలని మనందరి తరపున శ్రీమాన్ విభూ చైతన్య గారి సాక్షిగా సద్గురు నాన్న గారి ఆశీర్వాదాలతో భగవంతుణ్ణి ప్రార్ధించారు. శ్రీమతి మంతెన పద్మ గారికి మరియు శ్రీమతి పెన్మెత్స సుజాత గారికి డైరెక్టర్ శ్రీమతి ఉషారాజు గారు మహిళా కార్యవర్గ సభ్యులు వీరికి శాలువాలు కప్పి సత్కరించారు. శ్రీ DS వర్మ గారు, శ్రీ DSP వర్మ గారు, కళ్లేపల్లి సుబ్బరాజు గారు, జాయింట్ సెక్రెటరిస్ వారికీ శ్రీ కృష్ణ భగవానుడి చిత్రపటాలను బహుకరించారు. వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ SSN రాజు గారు, శ్రీ బుద్దరాజుశివాజీ గారు ఫ్రూట్ బాస్కెట్ లను ఇచ్చారు. కార్యక్రమములో EC మెంబెర్స్ శ్రీ VVSV ప్రసాద్ రాజు గారు, శ్రీ DVV గోపాల రాజు గారు, శ్రీ P కృష్ణం రాజు గారు, శ్రీ KVK సత్యనారాయణ రాజు గారు, శ్రీ V అవినయ్ కుమార్ రాజు గారు , శ్రీమతి S ఉమాదేవి గారు, శ్రీమతి S రోహిణి గారు, శ్రీమతి U జానకీదేవి గారు, డైరెక్టర్స్ శ్రీమతి M ఉషారాజు గారు, శ్రీ K మురళీ కృష్ణం రాజు గారు, క్షత్రియ పెద్దలు, అనేకమంది భక్తులు సుమారు 400 మంది వరకు పాల్గొన్నారు. చివరగా శ్రీమతి సుజాత గారు కార్యక్రమం గురించి చక్కగా మాట్లాడారు. సర్వీస్ చేసిన అందరికి ధన్యవాదాలు తెలియజేసి వందన సమర్పణ చేసారు.

Swami Jnanananda Jayanthi

05 December 2025

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 05-12-2025వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు ASR భవన్ సెకండ్ ఫ్లోర్ లో స్వామి జ్ఞానానంద వారి 129 వ జయంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు ఉపాధ్యక్షులు శ్రీ S.S.N. రాజు గారిని, చైర్మన్ శ్రీ G.S.N. రాజు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశాఖపట్నం రామకృష్ణ మిషన్ సెక్రటరీ శ్రీ స్వాసం వేద్యానంద మహారాజ్ గారిని, గౌరవ అతిధి కార్డియోలజిస్ట్ ఫ్లోరిడా, USA డా. బి. రామరాజు గారిని, గెస్ట్ స్పీకర్ AU న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ డా. పి. వి లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి జ్ఞానానంద వారి చిత్రపటానికి పూవులు సమర్పించి ప్రార్థనా గీతం ఆలపించి సభను ప్రారంబించడం జరిగింది. సమితి ఉపాధ్యక్షులు శ్రీ S.S.N. రాజు గారు సమావేశానికి విచ్చేసిన అతిధులకు సభ్యులందరకు స్వాగతం తెలియ జేశారు. స్వామి జ్ఞానానంద గారి జీవితం గురించి వారు చేసిన సేవల గురించి, సాధించిన విజయాల గురించి తేదీలతో సహా వివరంగా తెలియజేయడం జరిగింది. తర్వాత చైర్మన్ శ్రీ G.S.N. రాజు గారు మాట్లాడుతూ చాల మంది మేధావుల జీవితంలో సైన్టిస్టులు అయిన తర్వాత సన్యాసులుగా మారతారు. కానీ స్వామిజి వారు ముందు సన్యాసిగా మారి తర్వాత గొప్ప సైన్టిస్ట్ గా అయ్యారు. ఆయన జర్మనీ వెళ్లి వేదిక్ ఫిలాసఫీ లిటరేచర్ మీద బాగా పని చేసారు. న్యూక్లియర్ ఫిజిక్స్ మీద రీసెర్చ్ చేసారు. ఈ రోజులలో సైన్స్ గురించి మీనింగ్ తెలియకుండానే సైన్టిస్ట్ లు అవుతున్నారు. సిస్టమాటిక్ కంప్రెహెన్సీవ్, ఇన్వెస్టిగేషన్, ఎంప్లోరేషన్, నేచురల్ కాసెస్, ఎఫెక్ట్స్(సైన్స్) అని విద్యార్థులకు వివరించడం జరిగింది. మాజీ చైర్మన్ శ్రీ M.S.N. రాజు గారు మాట్లాడుతూ స్వామి జ్ఞానానంద గారికి వివాహం అయినప్పటికీ వైవాహిక జీవితం మీద ఇంట్రెస్ట్ లేక ఆయనకున్న ఆధ్యాత్మిక చింతనతో చిన్న వయసులోనే హిమాలయాలకు వెళ్లి కఠోర సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందారు. ఇంకా ఆధ్యాత్మిక విషయాల గురించి, అయన సైన్టిస్ట్ గా సాధించిన విజయాల గురించి వివరించారు. గెస్ట్ స్పీకర్ డా. P.V. లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ స్వామిజీ గారి గురించి ఎంత చెప్పిన తనివి తీరదు. న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా ఉండడం నా అదృష్టం అని అన్నారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి దేనిమీదా వ్యామోహం ఉండదు కానీ ఆయనకి చిన్నప్పటినుండి సైన్స్ మీద ఉన్న ఆసక్తి వలన అయన జర్మనీ వెళ్లి రీసెర్చ్ చేయడం చాల గొప్ప విషయం అని అన్నారు. స్వామిజీ చరిత్ర ఎప్పుడూ మనకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. తర్వాత ముఖ్య అతిధి స్వాసంవేద్యానంద మహారాజ్ గారు స్వామిజీ గురించి వివరించారు. సైన్స్ చదివే ప్రతివాళ్ళు సైన్టిఫిక్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడే మనం చదివిన చదువుకి ఒక సార్థకత. దానిలో లీనమై తన్మయత్వం చెంది సాదించగలగాలి. మన జీవితం కూడా ఒక సైన్స్ అని అన్నారు. గౌరవ అతిధి డా. బి రామరాజు గారు మాట్లాడుతూ స్వామిజీగా ఉన్నపుడు, శాస్త్రవేత్తగా ఉన్నపుడు వారి శైలి గురించి సాధించిన వాటి గురించి, జరిగిన సంఘటనల గురించి వివరించారు. సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు స్వామిజీ వారి కుటుంబ సభ్యులను అందరికీ పరిచయం చేసారు. స్వామిజీ కుటుంబంలో జన్మించినవారు ఎంత అదృష్టవంతులు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు శ్రీ S.S.N. రాజు గారు, సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు, ఛైర్మన్ శ్రీ G.S.N రాజు గారు డైరెక్టర్ శ్రీ Ch. సత్యదేవ్ గారు ఉప కార్యదర్శి శ్రీ V. జానకిరామ రాజు గారు, కార్యవర్గ సభ్యులు శ్రీ P.V. కృష్ణం రాజు గారు, శ్రీమతి S. ఉమాదేవి గారు, మాజీ ఛైర్మన్ శ్రీ M.S.N. రాజు గారు, మాజీ అధ్యక్షులు మాజీ ఛైర్మన్ శ్రీ S.V.S.S రామచంద్ర రాజు గారు మాజీ డైరెక్టర్ శ్రీ D.S. వర్మగారు, క్షత్రియ పెద్దలు AU విద్యార్థులు సుమారు 100 మందికి పైగా హాజరయినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు ధన్యవాదములు తెలియజేసారు.

Kartika Deepotsavam

12 November 2025

క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం వారు హరే కృష్ణ మూవ్ మెంట్, విశాఖపట్నం (ది అక్షయ పాత్ర ఫౌండేషన్) వారితో కలిసి 22.11.2025, బుధవారం సాయంత్రం నుండి విశాఖపట్నం క్షత్రియ కళ్యాణమండపంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా తులసి పూజ, శ్రీ కృష్ణ అష్టోత్తర పూజ, శ్ర కృష్ణుని భజనలు, చిన్నపిల్లలచే నృత్యములు చేయడం జరిగినవి. అనంతరం హరే కృష్ణ మూవ్ మెంట్, విశాఖపట్నం ప్రెసిడెంట్ డా. నిష్కించన భక్త దాసా వారు కార్తీక దీపోత్సవ ప్రాముఖ్యతను గురించి, భగవద్గీతను అందరూ చదవవలసిన ఆవశ్యకతను గురించి, శ్రీ కృష్ణ భగవానుని గొప్పతనం గురించి ప్రసంగించారు. తర్వాత భక్తులందరూ కార్తీక దీపాలను భక్తి శ్రద్దలతో వెలిగించారు. తర్వాత హరేకృష్ణ మూవ్ మెంట్ ప్రెసిడెంట్ డా.నిష్కించన భక్త దాసా గారిని, సెక్రటరీ శ్రీ యదురాజ దాసా గారిని సత్కరించారు. ఈ కార్తీకదీపోత్సవ కార్యక్రమంలో 400 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ క్షత్రియ సంక్షేమ సమితి వారు సాంప్రదాయ భోజనం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ సంక్షేమ సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ S.S.N. రాజు గారు, సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు, డైరెక్టర్ శ్రీ K. మురళీ కృష్ణంరాజు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ V. జానకిరామ రాజు గారు, EC మెంబర్స్ శ్రీ P.V.N. తాతమ్మ రాజు గారు, శ్రీ D.V.V. గోపాల రాజు గారు, శ్రీ B.VS. సుబ్బ రాజు గారు ఇంకా అనేకమంది క్షత్రియ పెద్దలు, మహిళలు, భక్తులు అనేకమంది పాల్గొన్నారు.

SS Raju Garu Santapasabha

06 November 2025

క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం వారు 06-11-2025 వ తేదీ గురువారం సాయంత్రం 4.00 గంటలకు మాజీ అధ్యక్షులు కీ.శే. శ్రీ సయ్యపరాజు సత్యనారాయణ రాజు (S S రాజు) గారికి సంతాపసభ జరిపారు. శ్రీ S.S. రాజు గారు 01-11-2025 వ తేదీన స్వర్గస్తులయినారు. ముందుగా సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ కీ.శే శ్రీ S.S. రాజు గారు మన క్షత్రియ సంక్షేమ సమితి కి అధ్యక్షులుగా సేవలందించారని, లయన్స్ క్లబ్ గవర్నర్ గా కూడా సేవ చేసారని, ఎందరికో క్షత్రియులకు సహాయపడ్డారని, ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేయించేవారని అందుకే ఆయనకు ఎంతో ఇష్టమయిన కార్తీకమాసం ఏకాదశిరోజున శివైక్యం చెందారని, అయన లేకపోవడం తీరని లోటని చెబుతూ 2 నిముషాలు మౌనం పాటిద్దాం అని చెప్పగా అందరూ 2 నిముషాలు మౌనం పాటించారు. తర్వాత శ్రీ S.S. రాజు గారి చిత్ర పటానికి పుష్పాలు సమర్పించవలసినదిగా అధ్యక్షులు తిరుపతి రాజు గారిని, చైర్మన్ శ్రీ GSN రాజు గారిని, S.S. రాజు గారి కుమారులు వేణు గారిని రాము గారిని మరియు కార్యక్రమినికి వచ్చిన వారందరిని కోరగా అందరు చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులు అర్పించారు. క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ శ్రీ S.S. రాజు గారు 2 మార్లు క్షత్రియ సంక్షేమ సమితికి అధ్యక్షులు గా సేవలందించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ గా కూడా సేవ చేసారు. విశాఖపట్నంలో నాకు మొట్టమొదటిగా పరిచయమైన ఆత్మీయ క్షత్రియులు శ్రీ S.S. రాజు గారు అని అన్నారు. క్షత్రియులకు చాలామందికి సహాయం చేసారని, వారు లేకపోవడం తీరని లోటని, వారి ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నానని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు. తర్వాత చైర్మన్ శ్రీ G.S.N. రాజు గారు, డైరక్టర్ శ్రీ K. మురళీ కృష్ణం రాజు గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ G.V. రవి రాజు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ V. జానకిరామ రాజు గారు మొదలగు వారు మాట్లాడుతూ శ్రీ S.S. రాజు గారు క్షత్రియ సంక్షేమ సమితికి 2 మార్లు అధ్యక్షులుగా సేవలందించారని, అయన ప్రముఖ కాంట్రాక్టర్ కావడంతో చాలామందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దారని, క్షత్రియులకు చాలామందికి ఎంతో సేవ చేసారని ఆయన గొప్పతనం గురించి కొనియాడారు. తర్వాత కె.శే శ్రీ S.S. రాజు గారి కుమారుడు శ్రీ రాము గారు మాట్లాడుతూ ' నాన్న గారు చాల క్రమ శిక్షణతో ఉండేవారని క్షత్రియులందరికి ఎదో విధముగా సహాయపడాలని తపించేవారు అని అన్నారు. వారికి ఉన్న అవకాశాలను వారితో పాటు అందరూ వినియోగించుకోవాలని కోరుకునేవారని, నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారని దానితో కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదురయ్యేవని’ తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం జరిపినందుకు క్షత్రియ సంక్షేమ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ G.S.N రాజు గారు, సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ S.S.N. రాజు గారు, జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V. జానకిరామ రాజు గారు, శ్రీ K.V.B.S. నాగ రాజు గారు, ట్రెజరర్ G. మనోహర్ గారు, E.C మెంబెర్ శ్రీ P.V కృష్ణం రాజు గారు, ఎఫిలియేటెడ్ సమితి మెంబెర్ శ్రీ D. సీతారామ రాజు గారు, స్పెషల్ ఇన్వైటీస్ శ్రీ K.V. సత్యనారాయణ రాజు గారు, శ్రీ B.V.S. సుబ్బ రాజు గారు, మాజీ కార్పొరేటర్ శ్రీ G.V. రవి రాజు గారు, శ్రీ D.S.P. వర్మ గారు, A. సూర్యనారాయణ రాజు గారు మొదలగు క్షత్రియ పెద్దలు, శ్రీ S.S. రాజు గారి కుమారులు శ్రీ వేణు గారు, శ్రీ రాము గారు పాల్గొన్నారు.

KP RRR Meeting

22 October 2025

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 22-10-2025, బుధవారం నాడు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ K. రఘురామకృష్ణంరాజు గారు మరియు బిజెపి శాసన సభాపక్ష నేత, విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ P. విష్ణుకుమార్ రాజు గార్లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశములో 150 మంది వరకు క్షత్రియులు హాజరయినారు. ముందుగా సెక్రటరీ శ్రీ R.V. గణపతి రాజుగారు క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారిని, చైర్మన్ శ్రీ G.S.N. రాజు గారిని, డిప్యూటీ స్పీకరు శ్రీ K. రఘురామకృష్ణం రాజు గారిని, M.L.A శ్రీ P. విష్ణుకుమార్ రాజు వారిని, క్షత్రియ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు శ్రీ Ch. వెంకటపతి రాజు గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరినారు. ప్రార్థన గీతమును ఆలపించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ సమితి ప్రతి సంవత్సరం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి, శ్రీ రఘురామకృష్ణం రాజు గారికి అభినందనలు తెలియ జేస్తూ అయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి కి గవర్నమెంట్ స్థలం మంజూరు చేయించవలసినదిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణం రాజు గారికి విన్నపం చేసారు. తర్వాత క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ G.S.N రాజు గారు, మాజీ చైర్మన్ శ్రీ M.R. K రాజు గారు, క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు శ్రీ Ch వెంకటపతి రాజు గారు (పెదబాబు) మొదలగు వారు మాట్లాడుతూ శ్రీ రఘు రామకృష్ణం రాజు గారు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం చాలా ఆనందంగా ఉన్నదని, ఉండి నియోజకవర్గం లో కూడా చాలా అభివృద్ధి పనులు చేయిస్తున్నారని, చాలా ఉన్నతమైన వ్యక్తి అని, అయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలు విధాల కొనియాడారు. తర్వాత శ్రీ P విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ గతంలో చాలామంది డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టినప్పటికీ పెద్దగా గుర్తిపు ఉండేది కాదని కానీ శ్రీ రఘు రామకృష్ణం రాజు గారు డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడం ఆ పదవికే గుర్తిపు తెచ్చిందని చాలా చక్కగా తమ భాద్యతలు నిర్వర్తిస్తున్నారని, వారి నియోజకవర్గంలో కూడా చాల అభివృద్ధి కార్యక్రమాలు చేయిస్తున్నారని అన్నారు. ఇప్పుడు మీరు ఏవైనా సందేహాలు, సమస్యలు ప్రస్తావిస్తే రఘురామకృష్ణం రాజు గారు వాటికీ సమాదానాలు, పరిష్కారాలు చెపుతారని అన్నారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ శ్రీ K రఘురామ కృష్ణం రాజు గారు మాట్లాడుతూ నేను వేరే పని ఉండి విశాఖపట్నం రావలసి వచ్చి విష్ణుకుమార్ రాజుగారితో వైజాగ్ వస్తున్నానని చెప్పాను అయన వెంటనే 5 నిముషాల తర్వాత మరలా ఫోన్ చేసి ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి చెప్పారు నేను మీ అందరిని కలవాలనే కోరికతో వెంటనే సరే అని చెప్పాను. మీ అందరని ఇలా కలవడం చాల ఆనందంగా ఉంది. ఇక్కడ మీ అందరికి ఏ అవసరం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా పరిష్కరించడానికి విష్ణుకుమార్ రాజు గారు ఎప్పుడూ సిద్ధముగా ఉంటారు. ఆయనతోపాటు నేను కూడా ఉన్నాను మీకు ఏ అవసరం వచ్చిన తెలియజేయండి అన్నారు. తర్వాత కొంతమంది క్షత్రియ సభ్యులు వారికి ఉన్న సమస్యలను వారిముందు ఉంచడం జరిగింది. వాటిని తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసినది. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు, డైరెక్టర్లు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, డోనార్స్ మరియు అనేకమంది క్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు.

Ashok Garu Felicitation

02 October 2024

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 02-10-2024, బుధవారం గాంధీ జయంతి రోజున శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో 130 మంది వరకు దివ్యాంగులకు 3 లక్షల విలువైన కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి మిషిన్స్, బ్లైండ్ వారికి హ్యాండ్ స్టిక్స్ మొదలగు వాటిని పంపిణీ చేయు కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి విజయనగరం RDO శ్రీమతి. కీర్తి దాట్ల గారు ముఖ్య అతిథిగా హాజరుకావడం జరిగినది.. ఈ కార్యక్రమానికి మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ R నరసింహ రాజు గారు ఒక లక్ష రూపాయలు, క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు ఒక లక్ష రూపాయలు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ముఖ్య అతిథి శ్రీమతి. కీర్తి దాట్ల గారు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch. వెంకటపతి రాజు గారు, మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి శ్రీ M. బలరామ రాజు గారు మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జగదీష్ బాబు గారు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమానికి సమితి డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ SSN రాజు గారు (Chitti), శ్రీ బుద్దరాజు శివాజీ గారు, జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V జానకిరామ రాజు గారు, శ్రీ KVBS నాగ రాజు గారు (సెక్యూరిటీ శ్రీను) ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు మొదలగు కమిటీ సభ్యులు, ఇతర క్షత్రియ పెద్దలు మరియు కృత్రిమ అవయవాలు పొందడానికి వచ్చిన లబ్ధిదారులు కలిసి 200 మంది వరకు హాజరైనారు. ముందుగా మహాత్మాగాంధీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఫోటోలకు వారి జయంతి సందర్బంగా పూల మాలలు వేసి, వారి గొప్పతనాన్ని మననం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి శ్రీమతి కీర్తి దాట్ల గారు, సమితి అధ్యక్షులు శ్రీ D తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి చేస్తున్న చాలా గొప్ప కార్యక్రమాలలో ఇది కూడా చాలా మంచి కార్యక్రమమని, ఎంతోమంది దివ్యాంగులకు చేయూతనివ్వడం జరుగుతున్నదని అన్నారు. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజానికి ఏదోరకంగా సేవ చేయాలనే కాంక్షతో ఈవిదంగా దివ్యాంగులకు సేవ చేస్తున్నారని జగదీష్ బాబు గారిని అభినందించారు.. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జగదీష్ బాబు గారు మాట్లాడుతూ సుమారు 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు ఈ కార్యక్రమం చేస్తూ ఎంతోమంది దివ్యాంగులకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదుకుంటున్నారని, వారు చేస్తున్న సేవలు ఎప్పటికి మరచిపోలేనివని అన్నారు. ఇంత గొప్పగా మాకు సేవ చేస్తూ మాకు తోడ్పాటునందిస్తున్నందుకు క్షత్రియ సంక్షేమ సమితి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నానని అన్నారు. తర్వాత దివ్యాంగులు అందరికి కృత్రిమ అవయవాలు, ట్రై సైకిల్స్ మొదలగు పరికరాలు పంపిణీ చేసారు. ముఖ్య అతిథి కీర్తి దాట్ల గారు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ D తిరుపతి రాజు గారు, చైర్మన్ MSN రాజు గారు, డైరెక్టర్స్, కమిటీ సభ్యులు స్వయంగా కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు ధరింపజేశారు. దివ్యాంగులందరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేయడం జరిగినది. సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.

Annual General Meeting

15 September 2024

క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం యొక్క వార్షిక సర్వ సభ్య సమావేశం 15 -09-2024 ఆదివారం జరిగినది. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన గీతం తో నేటి సమావేశం ప్రారంభమయినది. సమావేశమునకు డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు, డోనార్స్ , యూత్ సభ్యులు, క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు 230 మంది హాజరయినారు. ప్రస్తుత కార్యవర్గ కమిటీ కాలపరిమితి పూర్తి అయినందున కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఎన్నికల కమిటీ వారిచే ప్రకటించడం జరిగినది. సమావేశంలో మొదట అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు సభ్యులందరకు స్వాగతం పలికారు. తర్వాత ఈ సంవత్సరం స్వర్గస్తులయిన వారికీ సంతాపం తెలియజేస్తూ రెండు నిముషములు మౌనం పాటించారు. తరవాత సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు గత సర్వసభ్య సమావేశపు మినిట్స్ చదివి వినిపించగా సభ్యులు ఆమోదం తెలిపారు. తర్వాత అధ్యక్షులు వారు సమితి గత AGM నుండి ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలను గురించి వివరిస్తూ.. అక్టోబరు 2వ తేదీన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం జరిగినది. 3 లక్షల విలువైన పరికరాలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం శ్రీ MSN రాజు గారు, M/s మహీధర కెమికల్స్ చైర్మన్ శ్రీ R నరసింహ రాజు గారు, శ్రీ MRK రాజు గారు డొనేట్ చేయడం జరుగుతుంది. అక్టోబరు 31 వ తేదీన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. నవంబర్ 11 వ తేదీన లేడీస్ & చిల్డ్రన్ కాంపిటిషన్ జరిగినది. ముగ్గుల పోటీలు, వంటల పోటీలు పిల్లలకు డ్రాయింగ్, క్విజ్, బహురూప వేషధారణ మొదలగు పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. తర్వాత డిశంబర్ 17 వ తేదీన చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ లో కార్తీక వన మహోత్సవం (పిక్నిక్ ) ఘనంగా నిర్వహించామని, 6000 మంది క్షత్రియులు పాల్గొనడం జరిగినది. చాల చక్కగా ఈ కార్యక్రమం జరిగినదని తెలియజేసారు. తర్వాత జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం, ఏప్రిల్ 9 న ఉగాది ని సంప్రదాయబద్దంగా జరిపామని అన్నారు. ఉగాది కార్యక్రమం శ్రీహరి రాజు గారు దంపతులు జరిపారని తర్వాత 17 వ తేదీన శ్రీ రామనవమి కార్యక్రమం చాలాబాగా జరిగినదని 1200 మంది వరకు భక్తులు సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. తర్వాత మే 1 వ తేదీన పీవీజీ రాజు గారి జయంతి, మే 7 వ తేదీన విప్లవజ్యోతి శ్రీ అల్లూరి సీతారామ రాజు వర్ధంతి జులై 4 వ తేదీన శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి నిర్వహించాము. శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి రోజున యూత్ వింగ్ వారి చే బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగినది అని అన్నారు. తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మరియు పేద మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం జరిగినది. 650 మంది స్టూడెంట్స్ కి 18 లక్షల 68 వేల రూపాయలు చెక్స్ అందజేయడం జరిగినదని అన్నారు. ఈ కార్యక్రమానికి డొనేట్ చేసిన దాతలందరికి ధన్యవాదాలు తెలియ జేశారు. తర్వాత ఆగష్టు 29 వ తేదీన వసుధ పౌండేషన్ వారిచే వసుధ వితరణ దినోత్సవం కార్యక్రమం జరిగినది. ఇందులో భాగంగా మన సమితి వారు ఇవ్వగా మిగిలిన 23 మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి కూడా వసుధ ఫౌండేషన్ వారు స్కాలర్ షిప్ ఇవ్వడం జరిగినదని తెలియజేసారు. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా నిర్వర్తించడానికి సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరికి మరియు చక్కని సలహాలు, సూచనలు చేసినటువంటి డైరెక్టర్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రతినెలా 183 మంది పేద వితంతు మరియు వికలాంగులకు పింఛను ఇస్తున్నామని, మ్యారేజ్ అసిస్టెన్స్ మరియు మెడికల్ అసిస్టెన్స్ కు వచ్చిన అన్ని అప్లికేషన్స్ కి ఆర్థిక సహాయం చేయడం జరిగినదని తెలియజేసారు. ప్రతి నెల ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మంచి సూచనలు ఇచ్చినటువంటి ఇంటర్నల్ ఆడిటర్ శ్రీ G విక్రమాదిత్య వర్మ గారికి, మరియు వార్షిక ఆదాయ వ్యయాలకు చట్టబద్దమైన ప్రక్రియాను కలిగించి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన ఎక్స్టర్నల్ ఆడిటర్ శ్రీ KSP రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. తర్వాత కమిటీ సభ్యులను అందరిని మెమెంటోస్ తో సత్కరించారు. ఈ మెమెంటోస్ ని శ్రీమతి ఎం ఉషా రాజు గారు స్పాన్సర్ చేసారు. అనంతరం ఎలక్షన్ కమిటీ వారు శ్రీ MSN రాజు గారు , శ్రీ P విష్ణుకుమార్ రాజు గారు , శ్రీ DS వర్మ గారు 2024 -27 కాలానికి నూతన కార్య వర్గ సభ్యులను ప్రకటించి సభకు పరిచయం చేసారు. అధ్యక్షులుగా శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు తిరిగి ఎన్నికవగా , ఉపాధ్యక్షులుగా శ్రీ SSN రాజు గారు (చిట్టి ), శ్రీ బుద్దరాజు శివాజీ గారు ఎన్నికయ్యారు. సెక్రటరీ గా శ్రీ RV గణపతి రాజు గారు, జాయింట్ సెక్రెటరీస్ గా శ్రీ V జానకిరామ రాజు గారు, శ్రీ KVBS నాగరాజు గారు (సెక్యూరిటీ శ్రీను ), ట్రెజరర్ గా శ్రీ గణపతిరాజు మనోహర్ గారు ఇంకా 15 మంది కమిటీ సభ్యుల పేర్లు తెలియజేసారు. నూతన కార్యవర్గ సభ్యులకు సభలోని వారందరు అభినందనలు తెలియజేసారు. అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.

KP Vasudha Program

29 August 2024

29-08-2024, గురువారం నాడు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో క్షత్రియ కల్యాణమండపంలో వసుధ వితరణోత్సవం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపకారవేతనాలు, సేవా సంస్థలకు చేయూత, ఆరోగ్యార్ధులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. స్వయంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామ రాజు గారు విచ్చేసి తమ చేతులమీదుగా ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మంతెన వెంకట రామ రాజు గారు, క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు, MLC Dr శ్రీ P సూర్యనారాయణ రాజు గారు (సురేష్ బాబు) వేదికను అలంకరించారు. ముందుగా ప్రార్ధనా గీతం ఆలపించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ, ఈ రోజు ఈ కార్యక్రమం మన సమితి లో జరగడం చాల ఆనందంగా ఉన్నదని మంతెన రామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అయన ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగిన స్వయంగా ఆయనే హాజరయ్యి సంతోషంగా అయన చేతుల మీదుగానే ఆర్థిక సహాయం చేస్తారని అన్నారు. సుమారు 250 పైగా సేవా సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ మంతెన వెంకట రామ రాజు గారు ఏ కార్యక్రమానికి వచ్చినా, AP లోనే కాదు ఇండియాలో ఏ కార్యక్రమానికి వెళ్లినా భారీగా విరాళాలు ఇస్తారని, సేవా కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తారని అన్నారు. MLC Dr. P సురేష్ బాబు గారు మాట్లాడుతూ మనందరికీ దేవుడు అంటే ఎంతో ఇష్టం. అయన ఎక్కడో ఉంటాడు. కానీ ఇక్కడ ఇలాంటివారిలోనే దేవుడు ఉంటాడు. ఎన్నో సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం చాల గొప్ప విషయం అన్నారు. వీరితోపాటుగా ఈ సేవా కార్యక్రమాలలో నేను తప్పక సహాయంగా ఉంటానని అన్నారు. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు మాట్లాడుతూ సమాజంలో సేవచేసే గుణం కొంతమందిలోనే ఉంటుందని, సేవా చేయడం వలన గ్రహీతకు ఉపయోగం జరుగుతుంది అది వేరే విషయం కానీ సేవ చేయడంలో మనకు అమితమైన ఆనందం కలుగుతుంది. ఆ విదంగా 25 సంవత్సరాలనుంచి నిస్వార్థంగా రామ రాజు గారు సమాజ సేవ చేస్తూఉన్నారు. మేమంతా మీకు సహచరులుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. తర్వాత వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజు గారు ప్రసంగిస్తూ ఎక్కడ మా సేవా కార్యక్రమాలు జరిగినా SVSS రామ చంద్ర రాజు గారు, PS రామచంద్ర రాజు గారు ఇలా మీ అందరు మా వెంట ఉండి మా కార్యక్రమాలలో పాల్గొనేవారు అని తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన అందరికి నమస్కారాలు తెలుపుతూ జీవితంలో సుఖాలు, కష్టాలు వస్తుంటాయని, సుఖాలు వచ్చినపుడు పొంగిపోవడం కష్టాలు వచ్చినపుడు కృంగిపోవడం జరగకూడదు అన్నారు. వీలయినంతవరకు సమాజ సేవా చేస్తూ ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. అదుపులో పెట్టులోవాలి అంటే ఆలోచనలు పోవాలి, సంకల్పం చేసుకోవాలి. నాది, నా అనే ఆలోచన ఉండకూడదు. అందరు మనవాళ్లే, మనది, మనం అనుకుంటూ ఆలోచన చేయాలి అప్పుడు ఆరోగ్యం, అన్నీబాగుంటాయి అన్నారు. స్టూడెంట్స్ వారి లైఫ్ సాఫీగా సాగిపోతుంటుంది. కష్టపడి మంచి గా చదువుకుని అభివృద్ధి సాదించాలి. మంచి అవకాశాలు పొందాలి. టైం వేస్ట్ చేసుకుని ఎదో జాబ్ చేసుకుంటున్నాంలే అంటే ఉపయోగం ఉండదు. మీరంతా బాగా చదువుకుని మంచి అభివృద్ధి సాదించాలి అన్నారు. తర్వాత సేవా సంస్థలకు ఆర్థిక సహాయం కోసం చెక్స్ అందజేయడం జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి సూచించిన ఇంజినీరింగ్ విద్యార్థులు 23 మందికి స్కాలర్ షిప్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, మానవతా, డా.కాప్స్ మెమోరియల్ సొసైటీ మొదలగు 22 సంస్థలకు 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి కమిటీ సభ్యులు, డైరెక్టర్స్, క్షత్రియ ప్రముఖులు, వివిధ సంస్థల లబ్ధిదారులు కలిసి 170 మందికి పైగా పాల్గొన్నారు. సెక్రటరీ DSP వర్మ గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.

Independence Day Celebrations

15 August 2024

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఆగష్టు 15వ తేదీన చాల ఘనంగా జరిపారు. ఆగష్టు 15వ తేదీన ఉదయం గం. 8.30 ని. లకు స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా జండా వందన కార్యక్రమం జరిగినది. వైస్ ప్రెసిడెంట్ శ్రీ ALN రాజు గారు (బుల్లిబాబు), సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు), శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ DS వర్మ గారు మొదలగు డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, నెడ్ కాప్ చైర్మన్ శ్రీ KK రాజు గారు, కార్పొరేటర్ శ్రీ అనిల్ కుమార్ రాజు గారు, లయన్స్ జిల్లా పూర్వపు గవర్నర్ శ్రీమతి M ఉషారాజు గారు ఇతర క్షత్రియ పెద్దలు ఈ జండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమితి ఉపాధ్యక్షులు శ్రీ ALN రాజు గారు గారు, KK రాజు గారు మరియు శ్రీమతి M ఉషా రాజు గారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఎన్నో తిరుగుబాట్లు, విప్లవాలు జరిగి మనకు స్వాతంత్య్రం లభించిందని అప్పటినుండి ఈ 77 సంవత్సరాలలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, చాల దేశాలు మనకంటే ముందే ఎప్పుడో స్వాతంత్య్రం పొందినప్పటికీ ఆయా దేశాల కంటే మన భారత దేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం 9.00 గంటల నుండి స్కాలర్ షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలైనది. క్షత్రియ సంక్షేమ సమితి ఉపాధ్యక్షులు శ్రీ ALN రాజు గారు, సెక్రటరీ సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch . వెంకటపతి రాజు గారు (పెదబాబు), డా. శ్రీ K సుబ్బరాజు గారు, శ్రీ DRK రాజు గారు వేదికను అలంకరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. సమితి డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, డా. కలిదిండి సుబ్బ రాజు గారు, శ్రీ Ch వెంకటపతి రాజు గారు మొదలగు వారు మాట్లాడుతూ ఈ రోజులలో పిల్లలు అందరికి చదువు ఎంతో అవసరమని, బాగా చదువుకోవడం ద్వారానే వారి భవిష్యత్ నిర్ణయింపబడుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, యువతరం గురించి, విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రస్తుత సమాజ పరిస్థితుల గురించి వివరించారు. క్షత్రియ సంక్షేమ సమితి ఇంతమందికి స్కాలర్ షిప్స్ ఇవ్వడం సాధ్యమవుతుందంటే ప్రధాన కారణం డోనార్స్ సహాయమే అని, డోనార్స్ వల్లనే ఇంత చక్కగా ఈ స్కాలర్ షిప్ కార్యక్రమం చేయగలుతున్నామని అన్నారు. డోనార్స్ అందరికి మెమెంటోస్ సమర్పించి ధన్యవాదాలు తెలియజేసారు. 650 మంది వరకు పేద మరియు మెరిట్ అయిన విద్యార్థులకు KG నుండి PG వరకు అన్ని తరగతులకు అనగా LKG నుండి 10 వ తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్, తరగతులకు, సుమారు 18 లక్షల రూపాయలు స్కాలర్ షిప్స్ అందజేయడం జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, విశాఖపట్నం నార్త్ MLA మరియు సమితి డైరెక్టర్ అయిన శ్రీ P విష్ణు కుమార్ రాజు గారు, డైరెక్టర్స్ శ్రీ MRK రాజు గారు, Ch వెంకటపతి రాజు గారు, మరియు డా. శ్రీ కలిదిండి సుబ్బ రాజు గారు, శ్రీ DRK రాజు గారు, శ్రీమతి M ఉషా రాజు గారు మొదలగు డోనార్స్ అందరి ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్ షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో కమిటీ సభ్యులు, డైరెక్టర్స్, డోనార్స్, యూత్ సభ్యులు ఇతర క్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు. సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు హాజరైన సభ్యులు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వందన సమర్పణతో ఈ నాటి కార్యక్రమం పూర్తయినది,

Ugadi Celebrations

03 March 2025

విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 30-03-2025 వ తేదీ ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిపారు. శ్రీ కె. రఘు రామకృష్ణం రాజు గారు, డిప్యూటీ స్పీకర్, ఆంధ్ర ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. ముఖ్య అతిథిగా మరియు విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం శాసనసభ్యులు, BJP శాసనసభాపక్ష నేత శ్రీ P విష్ణు కుమార్ రాజు గారు మరియు భీమిలి నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ గంటా శ్రీనివాస రావు గారు గౌరవ అతిథులుగా విచ్చేసారు. బ్రహ్మ దేవుడు తన సృష్టి ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాదిని తెలుగు వారందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా జరుపుకొనుట మన ఆచారము. చైత్రమాసం శుక్ల పక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజు ఉగాది పండుగ పర్వదినం. ఈ పర్వదినం రోజున గోపూజ, తులసిపూజ, పంచాంగ శ్రవణం చేస్తే సంపద, ఆయుష్షు, పాపప్రక్షాళన, వ్యాధినివారణ, గంగ స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. ఈ పర్వదినం రోజున విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితిలో లక్ష్మీ నారాయణ పూజ, తులసి పూజ, గోపూజ జరిపారు. క్షత్రియ సంక్షేమ సమితి డైరెక్టర్ శ్రీ AGK రాజు గారు దంపతులు మరియు జాయింట్ సెక్రటరీ శ్రీ V జానకిరామ రాజు గారు దంపతులు పీటల మీద కూర్చొని శాస్త్రోక్తంగా ఈ పూజలు నిర్వహించారు... అనంతరం ప్రముఖ జ్యోతిష్కులు డా. Ch. S. గోపాలకృష్ణ మూర్తి గారిచే ' పంచాంగ శ్రవణం' జరిగినది. నక్షత్రాన్ని బట్టి మరియు జన్మ తేదీ ని బట్టి ఈ సంవత్సర రాశి ఫలాలు చక్కగా వివరించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల రాశి ఫలాలు కూడా వివరించారు.. తరువాత సన్మాన కార్యక్రమం మొదలయినది. కార్యక్రమంలో ముందుగా సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు ముఖ్య అతిథి శ్రీ K రఘురామకృష్ణం రాజు గారికి, గౌరవ అతిథులు శ్రీ P విష్ణుకుమార్ రాజు గారికి, శ్రీ గంటా శ్రీనివాస రావు గారికి ఘనంగా స్వాగతం పలికి వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం క్షత్రియ సంక్షేమ సమితి వారు అతిధులు ముగ్గురికి చిరు సత్కారం చేయడం జరిగినది. ముందుగా శ్రీ రఘురామకృష్ణం రాజు గార్కి సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు పూలదండ సమర్పించగా, క్షత్రియ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు (పెదబాబు) పుష్పగుచ్చం అందజేశారు. వైస్ ప్రెసిడెంట్ శ్రీ SSN రాజు (చిట్టి) గారు మెమెంటోను బహూకరించారు. వైస్ ప్రెసిడెంట్ బుద్దరాజు శివాజీ గారు వెంకటేశ్వర స్వామి వెండి విగ్రహ ఫోటో ను బహూకరించి శాలువా వేశారు. తర్వాత శ్రీ P విష్ణు కుమార్ రాజు గారికి సమితి అధ్యక్షులు శ్రీ D. తిరుపతి రాజు గారు పూల గుచ్చం సమర్పించగా, వైస్ ప్రెసిడెంట్ SSN రాజు గారు వెండి వినాయక ప్రతిమ ఫోటో ను బహూకరించారు. తదుపరి శ్రీ గంటా శ్రీనివాస రావు గారికి డైరెక్టర్ AGK రాజు గారు శాలువా వేయగా, అధ్యక్షులు తిరుపతి రాజు గారు, డైరెక్టర్స్ విక్రమాదిత్య వర్మ గారు, శ్రీ GVV హరి వర్మ గారు వెంకటేశ్వర స్వామి వెండి ఫోటో బహూకరించారు. తర్వాత అతిధుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ప్రారంభమైనది. కరాటే వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వరుసగా మూడు సంవత్సరములు గోల్డ్ మెడల్ సాధించిన శ్రీ భూపతిరాజు అన్మిష్ వర్మ ఇటీవల ఏడు అగ్ని పర్వతాలను అధిరోహించి అతి తక్కువ సమయంలో మరియు అతిచిన్న వయసులో అధిరోహించినవాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఉగాది సందర్బంగా అన్మిష్ వర్మకు సన్మానం చేయడం జరిగింది. అలాగే కుమారి పిన్నమరాజు శ్రీ హాసిత ఆఫ్రికా ఖండం లో ఎత్తయిన పర్వతంగా టాంజానియా లో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది మరియు ఎవరెస్ట్ బేస్ క్యాంపు ను చేరుకుంది. ఉగాది సందర్బంగా శ్రీ హాసితకు కూడా సన్మానం చేయడం జరిగింది. ముఖ్య అతిథి శ్రీ కె రఘురామ కృష్ణం రాజు గారు, గౌరవ అతిథులు శ్రీ P విష్ణు కుమార్ రాజు గారు మరియు శ్రీ గంటా శ్రీనివాస రావు గారు కలిసి భూపతిరాజు అన్మిష్ వర్మకు మరియు పిన్నమరాజు శ్రీ హాసితకు ఒకరి తర్వాత ఒకరికి సన్మానం చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథి డిప్యూటీ స్పీకర్ శ్రీ కె. రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడుతూ అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉగాది మీ అందరి జీవితాలలో కొత్త వెలుగులు తేవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అన్మిష్ వర్మ ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అంటూ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అంతకంటే ఇంకేమి ఉంటాయని చమత్కరించారు..మాకు ఈ సన్మానం లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ శ్రీ తిరుపతి రాజు గారికి, కమిటీ సభ్యులకు, విష్ణుకుమార్ రాజు గారికి, మరియు సమయం మించినా ఓపికతో ఇంతవరకు ఉన్న శ్రీ గంటా శ్రీనివాస రావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది వరకు క్షత్రియులు హాజరయినారు. క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ GSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, ఉపాధ్యక్షులు శ్రీ SSN రాజు గారు, శ్రీ బుద్దరాజు శివాజీ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ జానకిరామ రాజు గారు మరియు KVBS నాగరాజు గారు, (సెక్యూరిటీ శ్రీను) డైరెక్టర్స్ శ్రీ G. కోదండరామ రాజు గారు (పెదబాబు), శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ P మురళి మహేశ్వర రాజు గారు, శ్రీ AGK రాజు గారు, శ్రీ G విక్రమాదిత్య వర్మ గారు, శ్రీ సత్యదేవ్ గారు, శ్రీ K. మురళి కృష్ణం రాజు గారు మొదలైన వారు, కమిటీ సభ్యులు ఇంకా ఇతర క్షత్రియ పెద్దలు, క్షత్రియ మహిళలు, క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులందరకి ఉగాది పచ్చడి మరియు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటుచేయడమైనది. ఉగాది మహోత్సవానికి విచ్చేసిన క్షత్రియ సోదర, సోదరీమణులందరికి సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు ధన్యవాదాలు తెలియజేసారు.

Republic Day Celebrations

26 January 2025

క్షత్రియ సంక్షేమ సమితి విశాఖపట్నం వారు భారత గణతంత్ర దినోత్సవం ( రిపబ్లిక్ డే ) సందర్బంగా 26.01.2025 వ తేదీన ఉదయం 8 .00 గంటలకు జెండా వందన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు (శివాజీ), సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ బుద్దరాజు శివాజి గారుగారు, జాయింట్ సెక్రటరీ శ్రీ V. జానకి రామ రాజు గారు, ట్రెజరర్ శ్రీ G మనోహర్ గారు మరియు కమిటీ సభ్యులు శ్రీ PVN తాతమ్మ రాజు గారు, శ్రీ DVV గోపాల రాజు గారు, శ్రీ VVSV ప్రసాద్ రాజు గారు, శ్రీ Ch V గోపాల కృష్ణం రాజు గారు, శ్రీ PV కృష్ణ రాజు గారు మరియు శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ G కోదండ రామ రాజు గారు, శ్రీ G విక్రమాదిత్య వర్మ గారు, శ్రీ ALN రాజు గారు, శ్రీమతి దీపిక గారు, శ్రీమతి దివ్య గారు, మరియు చాల మంది క్షత్రియ పెద్దలు ఈ కార్యకమానికి హాజరయినారు. ఈ సందర్బంగా క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ… ఈ రోజున మన రాజ్యాంగం అమలుపరచబడి 75 సంవత్సరాలు పూర్తయినది. కావున మనందరం కూడా మన వంతు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ క్రమబద్ధతతో జీవన విధానాన్ని కొనసాగించవలసి అవసరం ఉంది. ప్రతి సామాన్య పౌరుడు దగ్గర నుండి భారత దేశ ప్రధమ పౌరుడి వరకు ఈ రాజ్యాంగమునకు మనందరం కట్టుబడి జీవించవలసినదే. మన విధానాన్ని సక్రమంగా నడిపి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరి పైన ఉందని ఈ రోజు మనందరం గుర్తు చేసుకోవలసినటువంటి సందర్భం అని చెబుతూ మరొక్కసారి విచ్చేసినటువంటి పెద్దలందరికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ బుద్దరాజు శివాజి గారు మాట్లాడుతూ వచ్చేసిన అందరికి నమస్సుమాంజలులు తెలియజేస్తూ 'భారతదేశం ఇన్ని సంవత్సరాలకు అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచపటంలో నిలవాలని కోరుకుంటున్నామని అన్నారు. సాంఘికంగా రాబోయే రోజులలో కూడా భారత దేశం సనాతన ధర్మానికి అనుకూలంగా క్షత్రియ సమాజం కూడా చెప్పుకునే విదంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అన్నారు.

Siddha Ayurvedam Program

25 January 2025

క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం వారు ప్రతి నెలలో ఒకసారి 'సిద్ద ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం' నిర్వహిస్తున్నారు. ప్రతి నెలలో 3వ శని, ఆదివారములు రెండు రోజుల పాటు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్నుముక నొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలగు సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితముగా వైద్యం చేయబడుతుంది. ప్రతి నెలలో కూడా రెండు రోజులు రోజుకి 250 మందికి పైగా అన్ని వర్గాల వారు వచ్చి ఈ వైద్యం చేయించుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా, వారు రావలసిన టైం కేటాయించడం వలన ఎక్కువ రద్దీ ఏర్పడకుండా చేయడం జరుగుతుంది. చాలామంది క్షత్రియులు మరియు ఇతర వర్గాలవారు కూడా క్షత్రియ సంక్షేమ సమితి వారు చాలా మంచి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Community Interaction Program

Ladies & Children Competitions

29 December 2024

క్షత్రియ సంక్షేమ సమితి విశాఖపట్నం వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న లేడీస్ & చిల్డ్రన్ కాంపిటీషన్స్ కార్యక్రమం ఈ సంవత్సరం 29-12-2024 ఆదివారం ఉదయం 9.00 గంటలనుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించారు. సుమారు 150 మంది వరకు క్షత్రియ మహిళలు, పిల్లలు ఈ కాంపిటీషన్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్షత్రియ పిల్లలకు వివిధ కేటగిరీలలో 5 సంవత్సరముల పిల్లల నుండి 18 సంవత్సరముల పిల్లల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, క్విజ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్, పాటల పోటీలు మొదలగునవి నిర్వహించడం జరిగినది. మరియు మహిళలకు వంటలపోటీలు, ముగ్గుల పోటీలు, మెహందీ, ఆర్ట్ & పెయింటింగ్, పాటల పోటీలు మొదలగునవి నిర్వహించారు. పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజేతలయిన వారికి మంచి మంచి బహుమతులు ఇవ్వడం జరిగింది. విజేతలకు బహూకరించిన బహుమతులన్నీ MIMS మెడికల్ కాలేజీ చైర్మన్ శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజు గారు (బాబీ) స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరకీ క్షత్రియ సంక్షేమ సమితి వారు లంచ్ ఏర్పాటుచేశారు.. ఈ కార్యక్రమానికి క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, ఇంచార్జ్ ప్రెసిడెంట్ శ్రీ SSN రాజు గారు (చిట్టి), సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, డైరెక్టర్స్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు, శ్రీ MRK రాజు గారు, శ్రీ G కోదండరామ రాజు గారు, శ్రీ DS వర్మ గారు, శ్రీ K మురళీ కృష్ణం రాజు గారు, FKSS వైస్ చైర్మన్ శ్రీ GS రాజు గారు మరియు క్షత్రియ సంక్షేమ సమితి జాయింట్ సెక్రటరీ శ్రీ V జానకిరామ రాజు గారు, ట్రెజరర్ శ్రీ G మనోహర్ గారు, కమిటీ సభ్యులు శ్రీ PVN తాతమ్మ రాజు గారు, శ్రీ SAN రాజు గారు, శ్రీ K శ్రీనివాస రాజు గారు, శ్రీ DVV గోపాల రాజు గారు, శ్రీ VVSV ప్రసాద రాజు గారు శ్రీ Ch V గోపాల కృష్ణం రాజు గారు, శ్రీ వేగేశ్న అవినై కుమార్ రాజు గారు, శ్రీ వేగేశ్న సుబ్రహ్మణ్య శివాజీ రాజు గారు, శ్రీ వాడపల్లి రాజా, శ్రీ G శ్రావణ్ కుమార్, శ్రీమతి సాగి ఉమా దేవి గారు, శ్రీ P శ్రీనివాస రాజు గారు, శ్రీ P అనిల్ కుమార్ గారు, శ్రీ KVK సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి రోహిణి రాజు గారు, శ్రీమతి ఎం ఉషారాజు గారు, శ్రీమతి P దీపిక గారు, ప్రొఫెసర్ M లక్ష్మీపతి రాజు గారు, ప్రొఫెసర్ V వల్లీ కుమారి గారు హాజరయినారు. మరియు చాలా మంది క్షత్రియ మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ Ch వెంకటపతి రాజు గారు ( పెదబాబు గారు )విశాఖపట్నం క్షత్రియ మహిళా అభ్యుదయ వేదికకు 25,000 రూపాయలు విరాళం ప్రకటించారు. చివరగా సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు విజేతలైన వారందరికీ అభినందనలు తెలియజేసారు. కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీమతి సాగి ఉమా దేవి గారికి, శ్రీమతి రోహిణి రాజు గారికి, శ్రీమతి ఎం ఉషారాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

  • Facebook
  • Twitter
  • Instagram

Terms & Conditions

Privacy Policy

Accessibility Statement

©2025 by Kshatriya Samkshema Samithi. Powered and secured by Trident Enterprises.

bottom of page