Chinna Jeeyar Swami Vari Program
10 December 2024
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి వారు 10-12-2024, మంగళవారం విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి కి విచ్చేసారు. స్వామివారిని దర్శనం చేసుకొనుటకు 300 మందికి పైగా భక్తులు రావడం జరిగింది. చిన జీయర్ స్వామి వారికి శ్రీ నడింపల్లి గౌతమ్ రాజు గారు దంపతులు కాళ్ళు కడగగా, క్షత్రియ పెద్దలందరూ పూర్ణకుంభంతో, భజంత్రీల నడుమ వేదిక వద్దకు తీసుకువెళ్లడం జరిగినది. సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు స్వామివారికి ప్రణామములు తెలియజేస్తూ అనుగ్రహభాషణం చేయవలసినదిగా కోరినారు. స్వామివారు ఆధ్యాత్మికతను గురించి, క్షత్రియుల ప్రత్యేకతను గురించి, మనం చేయవలసిన సామాజికసేవలను గురించి ఇంకా అనేక విషయాలను ప్రస్తావిస్తూ అనుగ్రహభాషణం చేసారు. తర్వాత కార్యక్రమానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికీ స్వామివారు స్వహస్తాలతో కమలాఫలం, యాపిల్ ఫలం ప్రసాదంగా ఇచ్చారు. స్వామివారు ప్రతి ఒక్కరికీ ప్రసాదం ఇవ్వడంతో భక్తులందరూ ఆనందపరవశులయినారు. అనంతరం స్వామివారు స్థాపించిన వారిజ ఆశ్రమం లో 1 కోటి 50 లక్షల వ్యయంతో అంధుల కొరకు పాఠశాల మరియు వేద పాఠశాల నిర్మాణం చేస్తున్నందున క్షత్రియ సంక్షేమ సమితి తరపున ఉడతా భక్తిగా 3 లక్షల రూపాయలు మరియు చైర్మన్ శ్రీ MSN రాజు గారు లక్ష రూపాయలు విరాళం సమర్పించడం జరిగినది.. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీ SSN రాజు గారు (చిట్టి), జాయింట్ సెక్రటరీ శ్రీ V జానకీరామ రాజు గారు, ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు, డైరెక్టర్స్ శ్రీ Ch వెంకటపతిరాజు గారు, శ్రీ DS వర్మ గారు, శ్రీ UV కాశీ రాజు గారు, శ్రీ G కోదండరామ రాజు గారు, శ్రీమతి PV రమణి గారు మొదలగువారు, కమిటీ సభ్యులు శ్రీ PVN తాతమ్మ రాజు గారు శ్రీ SAN రాజు గారు, శ్రీ VVSV ప్రసాద్ రాజు గారు, శ్రీ VS శివాజీ రాజు గారు, శ్రీ DVV గోపాల రాజు గారు, శ్రీ PV కృష్ణం రాజు గారు, శ్రీ V అవినయ్ కుమార్ రాజు గారు, శ్రీ V సీతారామ రాజు గారు, శ్రీమతి S ఉమా దేవి గారు మొదలగువారు మరియు శ్రీ PVTV గజపతి వర్మ గారు, శ్రీ P శ్రీనివాస రాజు గారు మొదలగు అఫిలియేటెడ్ సభ్యులు, శ్రీ BVS సుబ్బరాజు గారు, శ్రీమతి S రోహిణి రాజు గారు మొదలగు స్పెషల్ ఇన్వైటీస్, శ్రీ AGK రాజు గారు, శ్రీ సత్యదేవ్ గారు, శ్రీ ALN రాజు గారు, శ్రీ K సుబ్బ రాజు గారు వంటి ప్రముఖులు మరియు అనేకమంది క్షత్రియ మహిళలు కార్యక్రమములో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందినారు.
Community Program
05 December 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు డిశంబర్ 5 వ తేదీ గురువారం స్వామి జ్ఞానానంద వారి జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఉదయం 9 గంటలకు క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, ట్రెజరర్ శ్రీ జి మనోహర్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ V జానకి రామ రాజు గారు ఇంకా కమిటీ సభ్యులు Ch V గోపాల కృష్ణం రాజు గారు, DVV గోపాల రాజు గారు మొదలగు కమిటీ సభ్యులు, అమెరికా నుండి ఈ జయంతి వేడుకకు విచ్చేసిన Dr. B రామ రాజు గారు, ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ డిపార్టుమెంట్ హెడ్ Dr PV లక్ష్మీనారాయణ గారు, స్వామిజీ ఆశ్రంలో ఉంటున్న కృష్ణం రాజు గారు దంపతులు మొదలగువారు ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ డిపార్టుమెంట్ వద్ద ఉన్న శ్రీ స్వామి జ్ఞానానంద వారి విగ్రహానికి పూలదండలు వేయడం జరిగినది. సాయంత్రం 4.౦౦ గంటలకు స్వామి జ్ఞానానంద వారి 128 వ జయంతి సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటగా సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారిని, ఛైర్మన్ శ్రీ MSN రాజు గారిని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖపట్నం రామకృష్ణ మిషన్ సెక్రటరీ శ్రీ స్వాసంవేద్యానంద మహారాజ్ గారిని, గౌరవ అతిథి కార్డియాలజిస్ట్, ఫ్లోరిడా, USA డా. B రామ రాజు గారిని, AU న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ డా. PV లక్ష్మి నారాయణ గారిని వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం ప్రార్ధనా గీతం ఆలపించి, జ్యోతి ప్రజ్వలన చేసి, స్వామి జ్ఞానానంద వారి చిత్రపటానికి పూవులు సమర్పించి సభను ప్రారంభించారు. ముందుగా క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు సమావేశానికి విచ్చేసిన అతిథులకు, సభ్యులందరకు స్వాగతం తెలియజేస్తూ స్వామి జ్ఞానానంద వారి జయంతిని సంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని ఇంకా స్వామిజి గురించి వారు చేసిన సేవలు గురించి తెలియజేసారు. తర్వాత చైర్మన్ శ్రీ MSN రాజు గారు మాట్లాడుతూ శాస్త్రవేత్తలు స్వామిజీలుగా మారడం జరుగవచ్చు కానీ స్వామీజీ శాస్త్రవేత్తగా మారినది ఒక్క జ్ఞానానంద స్వామి వారేనని అన్నారు. ఇంకా ఆధ్యాత్మిక విషయాలు, దివచింతన గురించి వివరించారు. తర్వాత ముఖ్య అతిథి అయిన శ్రీ స్వాసంవేద్యానంద మహారాజ్ గారు స్వామిజి వారి గురించి అనేక విషయాలు తెలియజేసారు. స్వామిజీ జీవిత చరిత్రను గురించి, ఆయన కుటుంబం గురించి రామకృష్ణ మిషన్లతో ఆయనకున్న అనుబంధం గురించి తెలియజేసారు. గౌరవ అతిథి డా. బి రామ రాజు గారు మాట్లాడుతూ స్వామిజి వారి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను, స్వామిజిగా ఉన్నపుడు మరియు శాస్త్రవేత్తగా ఉన్నపుడు వారి శైలి, ప్రజ్ఞ, స్పందించిన తీరుని గురించి అనేక విషయాలను, జరిగిన సంఘటనలు తెలియజేసారు. గెస్ట్ స్పీకర్ డా PV లక్ష్మి నారాయణ గారు ఈ కార్యక్రమం జరగడం చాల ఆనందంగా ఉన్నదని, ప్రతి సంవత్సరం క్షత్రియ సమితి వారు ఈ జయంతి కార్యక్రమం జరపడం చాల గొప్ప విషయమని, వచ్చే సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీలో జరపాలని రిక్వెస్ట్ చేస్తున్నాని అన్నారు. చివరగా స్వామివారు శిష్య బృందంలో ఒకరైన శాస్త్రి గారు, మొదలగు వారు స్వామిజి వారితో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సమితి డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, క్షత్రియ పెద్దలు, AU విద్యార్థులు 150 మందికి పైగా హాజరయినారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరకీ సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు ధన్యవాదములు తెలియజేసారు
Deepotsavam Celebrations
27 November 2024
27-11-2024 బుధవారం నాడు క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం వారు క్షత్రియ కల్యాణమండపంలో "కార్తీక దీపోత్సవం" అత్యంత వైభవంగా జరిపారు. క్షత్రియ సంక్షేమ సమితి సెక్రటరీ శ్రీ R.V గణపతి రాజు గారు, శ్రీదేవి గారు దంపతులు పీటలమీద కూర్చుని తులసి పూజ, ఉసిరి పూజ, శివారాధన, లక్ష్మీనారాయణ పూజ చేయడం జరిగింది. అనంతరం బ్రహ్మ కుమారీస్ ట్రస్ట్, విశాఖపట్నం నుండి విచ్ఛేసిన సిస్టర్ శివలీల గారు కార్తీక దీపోత్సవం కార్తీక దీపారాధన ప్రాముఖ్యతను గూర్చి, కార్తీక దీపాలను వెలిగించడంలో ఉన్న విశిష్టతను గూర్చి, ధ్యానం చేయడం వలన చేకూరే ప్రయోజనాలను గూర్చి వివరించి కొంతసేపు ధ్యానం చేయించారు. అనంతరం క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజుగారు, అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ R.V గణపతి రాజు గారు మొదలగువారు ప్రధాన దీపం వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత క్షత్రియ మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి పైగా పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు రంగుల ముగ్గులు, ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు ప్రసాదాలు , మాజీ సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, మాజీ జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు) నెయ్యి, ప్రమిదలు, వత్తులు కార్యక్రమానికి స్పాన్సర్ చేసారు. ఈ కార్యకమంలో సమితి డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ SSN రాజు గారు (చిట్టి), శ్రీ బుద్ధరాజు శివాజీ గారు, జాయింట్ సెక్రటరీ V. జానకిరామ రాజు గారు, కమిటీ సభ్యులు ప్రసాద్ రాజు గారు, సుబ్రహ్మణ్య శివాజీ రాజు గారు, గోపాల రాజు గారు, సాగి ఉమా దేవి గారు, G. షణ్ముఖి గారు, P. శ్రీనివాస రాజు గారు, అనిల్ కుమార్ గారు, గజపతి రాజు గారు మొదలగువారు, ఇంకా యూత్ సభ్యులు, మహిళలు, క్షత్రియ పెద్దలు పాల్గొని కార్తీక దీపోత్సవాన్ని జయప్రదం చేసారు. ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన శ్రీమతి సాగి ఉమాదేవి గారికి సెక్రటరీ శ్రీ R.V గణపతి రాజు గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
PVG Raju Jayanthi
25 November 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు మహారాజా డాక్టర్ శ్రీ పీవీజీరాజు గారి శత జయంతి సందర్బంగా విశాఖపట్నం విచ్చేసిన అతిధులకు క్షత్రియ సంక్షేమ సమితికి ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్బంగా ట్రావెన్ కోర్ యువరాణి పద్మశ్రీ డాక్టర్ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ భాయి (శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టీ) గారిని, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ P అశోక్ గజపతి రాజు గారిని, విజయనగరం శాసన సభ్యులు శ్రీమతి అదితి గజపతి రాజు గారిని, ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్. గజల్ శ్రీనివాస్ గారిని, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి శ్రీ P రామచంద్ర రాజు గారిని, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ కరస్పాండెంట్ డాక్టర్ కె.వి లక్ష్మీపతి రాజు గారిని, శ్రీ హరి కృష్ణన్ గారిని సన్మానించారు. శాలువా కప్పి మెమెంటో అందజేశారు. ఈ సందర్బంగా క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ సమితి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి, డోనార్స్ చేస్తున్న ఆర్థిక సహాయం గురించి అతిథులకు వివరించారు. యువరాణి గారు మాట్లాడుతూ క్షత్రియ సంక్షేమ సమితి వారి ఆతిధ్యం మరియు ఆదరాభిమానాలకు ముగ్డురాలయ్యానని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు, జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V జానకీరామ రాజు గారు, శ్రీ KVBS నాగరాజు (సెక్యూరిటీ శ్రీను) గారు, మహారాజా బ్యాంకు చైర్మన్ శ్రీ MRK రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు (పెదబాబు), డైరెక్టర్స్ శ్రీ G కోదండరామ రాజు గారు, శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ మురళి కృష్ణం రాజు గారు, కార్యవర్గ సభ్యులు, శ్రీమతి M ఉషారాజు గారు, శ్రీ చంద్ర మౌళి ప్రసాద్ గారు ఇంకా ఇతర క్షత్రియ పెద్దలు పాల్గొన్నారు. అందరికి ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేయడం జరిగినది.

విశాఖపట్నం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో డాక్టర్ వై వి ఎస్ మూర్తి ఆడిటోరియంలో 25-11-2024 సోమవారం దివంగత విజయనగరం సంస్థానాధీశులు మహారాజా డాక్టర్ శ్రీ పీవీజీ రాజు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రావెన్ కోర్ యువరాణి పద్మశ్రీ డాక్టర్ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ భాయి (శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టీ) గారిని మహారాజా డాక్టర్ శ్రీ పీవీజీ రాజు ఆధ్యాత్మిక పురస్కార గ్రహీతగా కార్యక్రమానికి ఆహ్వానించారు. అతిథులుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ P అశోక్ గజపతి రాజు గారు, AP హై కోర్ట్ పూర్వ న్యాయమూర్తులు జస్టిస్ డి.వి.ఎస్.ఎస్ సోమయాజులు గారు, సభాధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్. గజల్ శ్రీనివాస్ గారు విచ్చేసారు. కార్యక్రమ సంచాలకులుగా భారతీయ విద్యాభవన్ కార్యదర్శి శ్రీ P రామచంద్ర రాజు గారు, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ కరస్పాండెంట్ డాక్టర్ కె.వి లక్ష్మీపతి రాజు గారు హాజరైనారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి మహారాజా శ్రీ పివిజి రాజు గారి చిత్రపటానికి పూవులు సమర్పించి కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమమంలో 500 మందికి పైగా హాజరైనప్పటికీ ప్రతీ ఒక్కరికి శ్రీ PVG రాజు గారి చిత్రపటానికి పూవులు సమర్పించే అవకాశం కల్పించారు. శ్రీ P అశోక్ గజపతి రాజు గారు మాట్లాడుతూ " పూర్వీకులు చూపిన దారిలో నడవడం, వారి ఆశయాలు నెరవేర్చడం భాద్యతగా భావిస్తున్నా. నువ్వు కరెక్ట్ అనుకున్నదాన్నే చేయి. ఎవరేమనుకుంటారోనని పట్టించుకోవద్దు అన్న నా తల్లిదండ్రుల మాటలను ఇప్పటికి పాటిస్తున్నానని అన్నారు. సాధారణ జీవితం గడిపిన తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అటువంటి సాధారణ జీవితాన్ని గడుపుతున్న ట్రావెన్ కొర్ యువరాణి గారికి ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాని వెల్లడించారు. పురస్కార గ్రహీత ట్రావెన్ కోర్ యువరాణి మాట్లాడుతూ డాక్టర్ PVG రాజు గారు నిరుపేదలను ఆదుకోవడానికి నిరంతరం పరితపించారని, అయన మనసున్న మహారాజు అని కొనియాడారు. తాము పద్మనాభ స్వామి దాసులుగా ఉండడానికి ఇష్టపడతామన్నారు. దాసులు అంటే సేవకులు. బానిసలూ అని భావించవచ్చని, తాము బానిసలుగా ఉండడానికే ఇష్టపడతామని అన్నారు. ఇప్పటి వరకు 70 పైగా అవార్డులు తీసుకున్నానని శ్రీ PVG రాజు పేరున అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు పద్మనాభ స్వామి పాదాలకు సమర్పిస్తున్నానని అన్నారు. సింహాద్రి అప్పన్న స్వామిని, కనకమహాలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకున్నానని, తనకు ఇప్పటికి ఆ భగవంతుడు అనుమతి ఇచ్చాడన్నారు. హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డి వి ఎస్ ఎస్ సోమయాజులు గారు మాట్లాడుతూ డాక్టర్ పి.వి.జి రాజు గారు తుది వరకు విలువలతో జీవించారన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్, సభ అధ్యక్షులు అయిన గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ చదువుల కంటే విలువలు గొప్పవని అటువంటి విలువలను ఆవిష్కరించిన గొప్ప వ్యక్తి PVG రాజు గారని కొనియాడారు. శ్రీ పీవీజీ రాజు గారికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం వారిని ఈ శతజయంతి సందర్బంగా కోరుతున్నాని అన్నారు. అనంతరం ట్రావెన్ కోర్ యువరాణి డాక్టర్ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ భాయి గారిని గజమాలతో సత్కరించి డాక్టర్ PVG రాజు గారి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం చేసారు.శాలువా కప్పి బొబ్బిలి వీణ, ప్రశంసా పత్రం PVG రాజు గారి జీవిత చరిత్ర పుస్తకం బహూకరించారు. ఈ కార్యక్రమానికి హరి కృష్ణన్ గారు, శ్రీ చంద్ర మౌళి ప్రసాద్ గారు, ఇంకా అనేకమంది హాజరయినారు. విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి నుండి అధ్యక్షులు శ్రీ D తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, డైరెక్టర్స్ శ్రీ MRK రాజు గారు, శ్రీ జి కోదండరామ రాజు గారు, శ్రీ GVV హరి వర్మ గారు, ట్రెజరర్ శ్రీ జి మనోహర్ గారు, కమిటీ సభ్యులు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సులర్ ప్రో. GSN రాజు గారు మాజీ డైరెక్టరు శ్రీ CSN రాజు గారు ఇంకా ఇతర ప్రముఖులు కార్యక్రమానికి హాజరయినారు. ఈ కార్యక్రమానికి ఇంకా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల నుండి అనేకమంది విద్యార్థులు హాజరయినారు. విద్యార్థులందరికీ క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు భోజనం ఏర్పాట్లు చేయడం జరిగినది. విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు మహారాజా డాక్టర్ శ్రీ పీవీజీరాజు గారి శత జయంతి సందర్బంగా విశాఖపట్నం విచ్చేసిన అతిధులకు క్షత్రియ సంక్షేమ సమితికి ఆహ్వానించి ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్బంగా ట్రావెన్ కోర్ యువరాణి పద్మశ్రీ డాక్టర్ అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ భాయి (శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టీ) గారిని, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ P అశోక్ గజపతి రాజు గారిని, విజయనగరం శాసన సభ్యులు శ్రీమతి అదితి గజపతి రాజు గారిని, ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్. గజల్ శ్రీనివాస్ గారిని, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి శ్రీ P రామచంద్ర రాజు గారిని, విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ కరస్పాండెంట్ డాక్టర్ కె.వి లక్ష్మీపతి రాజు గారిని, శ్రీ హరి కృష్ణన్ గారిని సన్మానించారు. శాలువా కప్పి మెమెంటో అందజేశారు. ఈ సందర్బంగా క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ సమితి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాల గురించి, డోనార్స్ చేస్తున్న ఆర్థిక సహాయం గురించి అతిథులకు వివరించారు. యువరాణి గారు మాట్లాడుతూ క్షత్రియ సంక్షేమ సమితి వారి ఆతిధ్యం మరియు ఆదరాభిమానాలకు ముగ్డురాలయ్యానని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు, జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V జానకీరామ రాజు గారు, శ్రీ KVBS నాగరాజు (సెక్యూరిటీ శ్రీను) గారు, మహారాజా బ్యాంకు చైర్మన్ శ్రీ MRK రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు (పెదబాబు), డైరెక్టర్స్ శ్రీ G కోదండరామ రాజు గారు, శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ మురళి కృష్ణం రాజు గారు, కార్యవర్గ సభ్యులు, శ్రీమతి M ఉషారాజు గారు, శ్రీ చంద్ర మౌళి ప్రసాద్ గారు ఇంకా ఇతర క్షత్రియ పెద్దలు పాల్గొన్నారు. అందరికి ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేయడం జరిగినది.
Sri Hasitha Program
01 November 2024
ఎవరెస్ట్ బేస్ కి మరియు మౌంట్ కిలిమంజారోకి వెళ్లిన క్షత్రియ యువ తేజం పిన్నమరాజు శ్రీ హాసిత. శ్రీ హాసిత, విశాఖపట్నం సీతమ్మధార, డాక్టర్స్ కాలనీ నివాసితులు శ్రీ దాట్ల వెంకట రామ రాజు గారు ( బోట్ రాజు గారు) మనుమరాలు. వీరి యొక్క స్వగ్రామం ఉమ్మడి తూర్ఫు గోదావరి జిల్లా,కేశనకుర్రు. మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారి చే అభినందన కార్యక్రమం జరిగింది.
Support Program for Differently Abled
02 October 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 02-10-2024, బుధవారం గాంధీ జయంతి రోజున శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో 130 మంది వరకు దివ్యాంగులకు 3 లక్షల విలువైన కృత్రిమ అవయవాలు, వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, వినికిడి మిషిన్స్, బ్లైండ్ వారికి హ్యాండ్ స్టిక్స్ మొదలగు వాటిని పంపిణీ చేయు కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమానికి విజయనగరం RDO శ్రీమతి. కీర్తి దాట్ల గారు ముఖ్య అతిథిగా హాజరుకావడం జరిగినది.. ఈ కార్యక్రమానికి మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ R నరసింహ రాజు గారు ఒక లక్ష రూపాయలు, క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు ఒక లక్ష రూపాయలు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ముఖ్య అతిథి శ్రీమతి. కీర్తి దాట్ల గారు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch. వెంకటపతి రాజు గారు, మహీధర కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి శ్రీ M. బలరామ రాజు గారు మరియు శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జగదీష్ బాబు గారు వేదికను అలంకరించారు. ఈ కార్యక్రమానికి సమితి డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ SSN రాజు గారు (Chitti), శ్రీ బుద్దరాజు శివాజీ గారు, జాయింట్ సెక్రెటరీస్ శ్రీ V జానకిరామ రాజు గారు, శ్రీ KVBS నాగ రాజు గారు (సెక్యూరిటీ శ్రీను) ట్రెజరర్ శ్రీ గణపతిరాజు మనోహర్ గారు మొదలగు కమిటీ సభ్యులు, ఇతర క్షత్రియ పెద్దలు మరియు కృత్రిమ అవయవాలు పొందడానికి వచ్చిన లబ్ధిదారులు కలిసి 200 మంది వరకు హాజరైనారు. ముందుగా మహాత్మాగాంధీ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఫోటోలకు వారి జయంతి సందర్బంగా పూల మాలలు వేసి, వారి గొప్పతనాన్ని మననం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి శ్రీమతి కీర్తి దాట్ల గారు, సమితి అధ్యక్షులు శ్రీ D తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి చేస్తున్న చాలా గొప్ప కార్యక్రమాలలో ఇది కూడా చాలా మంచి కార్యక్రమమని, ఎంతోమంది దివ్యాంగులకు చేయూతనివ్వడం జరుగుతున్నదని అన్నారు. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న సేవలను కొనియాడారు. సమాజానికి ఏదోరకంగా సేవ చేయాలనే కాంక్షతో ఈవిదంగా దివ్యాంగులకు సేవ చేస్తున్నారని జగదీష్ బాబు గారిని అభినందించారు.. శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జగదీష్ బాబు గారు మాట్లాడుతూ సుమారు 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు ఈ కార్యక్రమం చేస్తూ ఎంతోమంది దివ్యాంగులకు సహాయం చేస్తూ మమ్మల్ని ఆదుకుంటున్నారని, వారు చేస్తున్న సేవలు ఎప్పటికి మరచిపోలేనివని అన్నారు. ఇంత గొప్పగా మాకు సేవ చేస్తూ మాకు తోడ్పాటునందిస్తున్నందుకు క్షత్రియ సంక్షేమ సమితి వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నానని అన్నారు. తర్వాత దివ్యాంగులు అందరికి కృత్రిమ అవయవాలు, ట్రై సైకిల్స్ మొదలగు పరికరాలు పంపిణీ చేసారు. ముఖ్య అతిథి కీర్తి దాట్ల గారు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ D తిరుపతి రాజు గారు, చైర్మన్ MSN రాజు గారు, డైరెక్టర్స్, కమిటీ సభ్యులు స్వయంగా కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు ధరింపజేశారు. దివ్యాంగులందరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేయడం జరిగినది. సెక్రటరీ శ్రీ RV గణపతి రాజు గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.
Annual General Meeting
15 September 2024
క్షత్రియ సంక్షేమ సమితి, విశాఖపట్నం యొక్క వార్షిక సర్వ సభ్య సమావేశం 15 -09-2024 ఆదివారం జరిగినది. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థన గీతం తో నేటి సమావేశం ప్రారంభమయినది. సమావేశమునకు డైరెక్టర్లు, కార్యవర్గ సభ్యులు, డోనార్స్ , యూత్ సభ్యులు, క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు 230 మంది హాజరయినారు. ప్రస్తుత కార్యవర్గ కమిటీ కాలపరిమితి పూర్తి అయినందున కొత్త కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఎన్నికల కమిటీ వారిచే ప్రకటించడం జరిగినది. సమావేశంలో మొదట అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు సభ్యులందరకు స్వాగతం పలికారు. తర్వాత ఈ సంవత్సరం స్వర్గస్తులయిన వారికీ సంతాపం తెలియజేస్తూ రెండు నిముషములు మౌనం పాటించారు. తరవాత సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు గత సర్వసభ్య సమావేశపు మినిట్స్ చదివి వినిపించగా సభ్యులు ఆమోదం తెలిపారు. తర్వాత అధ్యక్షులు వారు సమితి గత AGM నుండి ఇంతవరకు నిర్వహించిన కార్యక్రమాలను గురించి వివరిస్తూ.. అక్టోబరు 2వ తేదీన దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం జరిగినది. 3 లక్షల విలువైన పరికరాలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం శ్రీ MSN రాజు గారు, M/s మహీధర కెమికల్స్ చైర్మన్ శ్రీ R నరసింహ రాజు గారు, శ్రీ MRK రాజు గారు డొనేట్ చేయడం జరుగుతుంది. అక్టోబరు 31 వ తేదీన మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది. నవంబర్ 11 వ తేదీన లేడీస్ & చిల్డ్రన్ కాంపిటిషన్ జరిగినది. ముగ్గుల పోటీలు, వంటల పోటీలు పిల్లలకు డ్రాయింగ్, క్విజ్, బహురూప వేషధారణ మొదలగు పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. తర్వాత డిశంబర్ 17 వ తేదీన చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ లో కార్తీక వన మహోత్సవం (పిక్నిక్ ) ఘనంగా నిర్వహించామని, 6000 మంది క్షత్రియులు పాల్గొనడం జరిగినది. చాల చక్కగా ఈ కార్యక్రమం జరిగినదని తెలియజేసారు. తర్వాత జనవరి 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం, ఏప్రిల్ 9 న ఉగాది ని సంప్రదాయబద్దంగా జరిపామని అన్నారు. ఉగాది కార్యక్రమం శ్రీహరి రాజు గారు దంపతులు జరిపారని తర్వాత 17 వ తేదీన శ్రీ రామనవమి కార్యక్రమం చాలాబాగా జరిగినదని 1200 మంది వరకు భక్తులు సీతారామ కళ్యాణంలో పాల్గొన్నారు. తర్వాత మే 1 వ తేదీన పీవీజీ రాజు గారి జయంతి, మే 7 వ తేదీన విప్లవజ్యోతి శ్రీ అల్లూరి సీతారామ రాజు వర్ధంతి జులై 4 వ తేదీన శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి నిర్వహించాము. శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి రోజున యూత్ వింగ్ వారి చే బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగినది అని అన్నారు. తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మరియు పేద మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం జరిగినది. 650 మంది స్టూడెంట్స్ కి 18 లక్షల 68 వేల రూపాయలు చెక్స్ అందజేయడం జరిగినదని అన్నారు. ఈ కార్యక్రమానికి డొనేట్ చేసిన దాతలందరికి ధన్యవాదాలు తెలియ జేశారు. తర్వాత ఆగష్టు 29 వ తేదీన వసుధ పౌండేషన్ వారిచే వసుధ వితరణ దినోత్సవం కార్యక్రమం జరిగినది. ఇందులో భాగంగా మన సమితి వారు ఇవ్వగా మిగిలిన 23 మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి కూడా వసుధ ఫౌండేషన్ వారు స్కాలర్ షిప్ ఇవ్వడం జరిగినదని తెలియజేసారు. ఈ కార్యక్రమాలన్నీ జయప్రదంగా నిర్వర్తించడానికి సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరికి మరియు చక్కని సలహాలు, సూచనలు చేసినటువంటి డైరెక్టర్స్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రతినెలా 183 మంది పేద వితంతు మరియు వికలాంగులకు పింఛను ఇస్తున్నామని, మ్యారేజ్ అసిస్టెన్స్ మరియు మెడికల్ అసిస్టెన్స్ కు వచ్చిన అన్ని అప్లికేషన్స్ కి ఆర్థిక సహాయం చేయడం జరిగినదని తెలియజేసారు. ప్రతి నెల ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మంచి సూచనలు ఇచ్చినటువంటి ఇంటర్నల్ ఆడిటర్ శ్రీ G విక్రమాదిత్య వర్మ గారికి, మరియు వార్షిక ఆదాయ వ్యయాలకు చట్టబద్దమైన ప్రక్రియాను కలిగించి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన ఎక్స్టర్నల్ ఆడిటర్ శ్రీ KSP రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. తర్వాత కమిటీ సభ్యులను అందరిని మెమెంటోస్ తో సత్కరించారు. ఈ మెమెంటోస్ ని శ్రీమతి ఎం ఉషా రాజు గారు స్పాన్సర్ చేసారు. అనంతరం ఎలక్షన్ కమిటీ వారు శ్రీ MSN రాజు గారు , శ్రీ P విష్ణుకుమార్ రాజు గారు , శ్రీ DS వర్మ గారు 2024 -27 కాలానికి నూతన కార్య వర్గ సభ్యులను ప్రకటించి సభకు పరిచయం చేసారు. అధ్యక్షులుగా శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు తిరిగి ఎన్నికవగా , ఉపాధ్యక్షులుగా శ్రీ SSN రాజు గారు (చిట్టి ), శ్రీ బుద్దరాజు శివాజీ గారు ఎన్నికయ్యారు. సెక్రటరీ గా శ్రీ RV గణపతి రాజు గారు, జాయింట్ సెక్రెటరీస్ గా శ్రీ V జానకిరామ రాజు గారు, శ్రీ KVBS నాగరాజు గారు (సెక్యూరిటీ శ్రీను ), ట్రెజరర్ గా శ్రీ గణపతిరాజు మనోహర్ గారు ఇంకా 15 మంది కమిటీ సభ్యుల పేర్లు తెలియజేసారు. నూతన కార్యవర్గ సభ్యులకు సభలోని వారందరు అభినందనలు తెలియజేసారు. అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.
KP Vasudha Program
29 August 2024
29-08-2024, గురువారం నాడు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారి ఆధ్వర్యంలో క్షత్రియ కల్యాణమండపంలో వసుధ వితరణోత్సవం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపకారవేతనాలు, సేవా సంస్థలకు చేయూత, ఆరోగ్యార్ధులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. స్వయంగా వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామ రాజు గారు విచ్చేసి తమ చేతులమీదుగా ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మంతెన వెంకట రామ రాజు గారు, క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు, MLC Dr శ్రీ P సూర్యనారాయణ రాజు గారు (సురేష్ బాబు) వేదికను అలంకరించారు. ముందుగా ప్రార్ధనా గీతం ఆలపించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు మాట్లాడుతూ, ఈ రోజు ఈ కార్యక్రమం మన సమితి లో జరగడం చాల ఆనందంగా ఉన్నదని మంతెన రామరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అయన ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగిన స్వయంగా ఆయనే హాజరయ్యి సంతోషంగా అయన చేతుల మీదుగానే ఆర్థిక సహాయం చేస్తారని అన్నారు. సుమారు 250 పైగా సేవా సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. FKSS చైర్మన్ శ్రీ Ch వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ మంతెన వెంకట రామ రాజు గారు ఏ కార్యక్రమానికి వచ్చినా, AP లోనే కాదు ఇండియాలో ఏ కార్యక్రమానికి వెళ్లినా భారీగా విరాళాలు ఇస్తారని, సేవా కార్యక్రమాలను ఎంతగానో ప్రోత్సహిస్తారని అన్నారు. MLC Dr. P సురేష్ బాబు గారు మాట్లాడుతూ మనందరికీ దేవుడు అంటే ఎంతో ఇష్టం. అయన ఎక్కడో ఉంటాడు. కానీ ఇక్కడ ఇలాంటివారిలోనే దేవుడు ఉంటాడు. ఎన్నో సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం చాల గొప్ప విషయం అన్నారు. వీరితోపాటుగా ఈ సేవా కార్యక్రమాలలో నేను తప్పక సహాయంగా ఉంటానని అన్నారు. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు మాట్లాడుతూ సమాజంలో సేవచేసే గుణం కొంతమందిలోనే ఉంటుందని, సేవా చేయడం వలన గ్రహీతకు ఉపయోగం జరుగుతుంది అది వేరే విషయం కానీ సేవ చేయడంలో మనకు అమితమైన ఆనందం కలుగుతుంది. ఆ విదంగా 25 సంవత్సరాలనుంచి నిస్వార్థంగా రామ రాజు గారు సమాజ సేవ చేస్తూఉన్నారు. మేమంతా మీకు సహచరులుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. తర్వాత వసుధ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మంతెన వెంకట రామరాజు గారు ప్రసంగిస్తూ ఎక్కడ మా సేవా కార్యక్రమాలు జరిగినా SVSS రామ చంద్ర రాజు గారు, PS రామచంద్ర రాజు గారు ఇలా మీ అందరు మా వెంట ఉండి మా కార్యక్రమాలలో పాల్గొనేవారు అని తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన అందరికి నమస్కారాలు తెలుపుతూ జీవితంలో సుఖాలు, కష్టాలు వస్తుంటాయని, సుఖాలు వచ్చినపుడు పొంగిపోవడం కష్టాలు వచ్చినపుడు కృంగిపోవడం జరగకూడదు అన్నారు. వీలయినంతవరకు సమాజ సేవా చేస్తూ ఉండాలి. మనసును అదుపులో ఉంచుకోవాలి. అదుపులో పెట్టులోవాలి అంటే ఆలోచనలు పోవాలి, సంకల్పం చేసుకోవాలి. నాది, నా అనే ఆలోచన ఉండకూడదు. అందరు మనవాళ్లే, మనది, మనం అనుకుంటూ ఆలోచన చేయాలి అప్పుడు ఆరోగ్యం, అన్నీబాగుంటాయి అన్నారు. స్టూడెంట్స్ వారి లైఫ్ సాఫీగా సాగిపోతుంటుంది. కష్టపడి మంచి గా చదువుకుని అభివృద్ధి సాదించాలి. మంచి అవకాశాలు పొందాలి. టైం వేస్ట్ చేసుకుని ఎదో జాబ్ చేసుకుంటున్నాంలే అంటే ఉపయోగం ఉండదు. మీరంతా బాగా చదువుకుని మంచి అభివృద్ధి సాదించాలి అన్నారు. తర్వాత సేవా సంస్థలకు ఆర్థిక సహాయం కోసం చెక్స్ అందజేయడం జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి సూచించిన ఇంజినీరింగ్ విద్యార్థులు 23 మందికి స్కాలర్ షిప్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్, మానవతా, డా.కాప్స్ మెమోరియల్ సొసైటీ మొదలగు 22 సంస్థలకు 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి కమిటీ సభ్యులు, డైరెక్టర్స్, క్షత్రియ ప్రముఖులు, వివిధ సంస్థల లబ్ధిదారులు కలిసి 170 మందికి పైగా పాల్గొన్నారు. సెక్రటరీ DSP వర్మ గారి వందన సమర్పణతో కార్యక్రమం పూర్తయినది.
Independence Day Celebrations
15 August 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఆగష్టు 15వ తేదీన చాల ఘనంగా జరిపారు. ఆగష్టు 15వ తేదీన ఉదయం గం. 8.30 ని. లకు స్వాతంత్య్ర దినోత్సవ సందర్బంగా జండా వందన కార్యక్రమం జరిగినది. వైస్ ప్రెసిడెంట్ శ్రీ ALN రాజు గారు (బుల్లిబాబు), సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు), శ్రీ GVV హరి వర్మ గారు, శ్రీ DS వర్మ గారు మొదలగు డైరెక్టర్లు, కమిటీ సభ్యులు, నెడ్ కాప్ చైర్మన్ శ్రీ KK రాజు గారు, కార్పొరేటర్ శ్రీ అనిల్ కుమార్ రాజు గారు, లయన్స్ జిల్లా పూర్వపు గవర్నర్ శ్రీమతి M ఉషారాజు గారు ఇతర క్షత్రియ పెద్దలు ఈ జండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమితి ఉపాధ్యక్షులు శ్రీ ALN రాజు గారు గారు, KK రాజు గారు మరియు శ్రీమతి M ఉషా రాజు గారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం లభించిందని, ఎన్నో తిరుగుబాట్లు, విప్లవాలు జరిగి మనకు స్వాతంత్య్రం లభించిందని అప్పటినుండి ఈ 77 సంవత్సరాలలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, చాల దేశాలు మనకంటే ముందే ఎప్పుడో స్వాతంత్య్రం పొందినప్పటికీ ఆయా దేశాల కంటే మన భారత దేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం 9.00 గంటల నుండి స్కాలర్ షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మొదలైనది. క్షత్రియ సంక్షేమ సమితి ఉపాధ్యక్షులు శ్రీ ALN రాజు గారు, సెక్రటరీ సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, FKSS చైర్మన్ శ్రీ Ch . వెంకటపతి రాజు గారు (పెదబాబు), డా. శ్రీ K సుబ్బరాజు గారు, శ్రీ DRK రాజు గారు వేదికను అలంకరించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత ప్రార్ధనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. సమితి డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, డా. కలిదిండి సుబ్బ రాజు గారు, శ్రీ Ch వెంకటపతి రాజు గారు మొదలగు వారు మాట్లాడుతూ ఈ రోజులలో పిల్లలు అందరికి చదువు ఎంతో అవసరమని, బాగా చదువుకోవడం ద్వారానే వారి భవిష్యత్ నిర్ణయింపబడుతుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, యువతరం గురించి, విద్య యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రస్తుత సమాజ పరిస్థితుల గురించి వివరించారు. క్షత్రియ సంక్షేమ సమితి ఇంతమందికి స్కాలర్ షిప్స్ ఇవ్వడం సాధ్యమవుతుందంటే ప్రధాన కారణం డోనార్స్ సహాయమే అని, డోనార్స్ వల్లనే ఇంత చక్కగా ఈ స్కాలర్ షిప్ కార్యక్రమం చేయగలుతున్నామని అన్నారు. డోనార్స్ అందరికి మెమెంటోస్ సమర్పించి ధన్యవాదాలు తెలియజేసారు. 650 మంది వరకు పేద మరియు మెరిట్ అయిన విద్యార్థులకు KG నుండి PG వరకు అన్ని తరగతులకు అనగా LKG నుండి 10 వ తరగతి వరకు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్, తరగతులకు, సుమారు 18 లక్షల రూపాయలు స్కాలర్ షిప్స్ అందజేయడం జరిగింది. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, విశాఖపట్నం నార్త్ MLA మరియు సమితి డైరెక్టర్ అయిన శ్రీ P విష్ణు కుమార్ రాజు గారు, డైరెక్టర్స్ శ్రీ MRK రాజు గారు, Ch వెంకటపతి రాజు గారు, మరియు డా. శ్రీ కలిదిండి సుబ్బ రాజు గారు, శ్రీ DRK రాజు గారు, శ్రీమతి M ఉషా రాజు గారు మొదలగు డోనార్స్ అందరి ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్స్ ను ఇవ్వడం జరిగింది. ఈ స్కాలర్ షిప్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం లో కమిటీ సభ్యులు, డైరెక్టర్స్, డోనార్స్, యూత్ సభ్యులు ఇతర క్షత్రియ ప్రముఖులు పాల్గొన్నారు. సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు హాజరైన సభ్యులు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వందన సమర్పణతో ఈ నాటి కార్యక్రమం పూర్తయినది,
ASR Jayanthi
07 July 2024
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన క్షత్రియ తేజం, విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 127వ జయంతి సందర్బంగా 04-07-2024 వ తేదీ గురువారం నాడు ఉదయం 9.00 గంటలకు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు సీతమ్మధార జంక్షన్ లో ఉన్న అల్లూరి సీతారామ రాజు గారి విగ్రహానికి మరియు బీచ్ రోడ్డులో ఉన్న అల్లూరి సీతారామ రాజు గారి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, డైరెక్టర్స్ బోర్డు స్పెషల్ ఇన్వైటీ మరియు నెడ్ క్యాప్ చైర్మన్ అయిన శ్రీ KK రాజు గారు, సమితి వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ ALN రాజు గారు (బుల్లిబాబు), శ్రీ N శ్రీనివాస రాజు గారు (కోడూరుపాడు), జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు), శ్రీ GVV హరి వర్మ గారు మొదలగు డైరెక్టర్స్, కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు మరియు ఇతర క్షత్రియ పెద్దలు పాల్గొన్నారు. సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు మరియు నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ KK రాజుగారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ అల్లూరి సీతారామ రాజు బ్రిటిష్ వారిపై స్వాతంత్య్రం కోసం చేసిన తిరుగుబాటును గూర్చి, గిరిజనులకు యుద్ధవిద్యలు నేర్పి వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన విధానం గురించి చెప్పడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్య్రం తేవాలని పోరాటం చేసి సీతారామ రాజు గారు ప్రాణ త్యాగం చేసారని కొనియాడారు. తర్వాత 8 00 గంటలనుండి క్షత్రియ సంక్షేమ సమితి, క్షత్రియ యూత్ వింగ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగినది. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ N శ్రీనివాస రాజు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు (అంజిబాబు) గారు, శ్రీ M కిషోర్ వర్మ, శ్రీ KRK రాజు, అభి మొదలగు కమిటీ సభ్యులు ఇంకా ఎంతోమంది యూత్ సభ్యులు, ఇతర క్షత్రియులు కూడా రక్త దానం చేసారు. శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి 127 వ జయంతి సందర్బంగా 127 యూనిట్ల బ్లడ్ డొనేట్ చెయ్యాలని సంకల్పంగా చేసుకుని అనేకమంది రక్త దానం చేసారు. యూత్ వింగ్ ప్రెసిడెంట్ G పృద్వి రాజు, సెక్రటరీ శ్రావణ్ వర్మ, రాజా, ప్రవీణ్, కిషోర్, గోపి, అభి మొదలగు యూత్ సభ్యులు రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాట్లలో చురుకుగా పాల్గొన్నారు. క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ ALN రాజు గారు, శ్రీ N శ్రీనివాస రాజు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు), నెడ్ కాప్ చైర్మన్ శ్రీ KK రాజు గారు, డైరెక్టర్స్, కమిటీ సభ్యులు, ఇతర క్షత్రియ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్త దానం చేసిన వారిని అభినందించారు.
Santapasabha
02 June 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 02-06-2024వ తేదీ ఆదివారం ఉదయం క్షత్రియ సంక్షేమ సమితి మాజీ చైర్మన్, విజయనగర్ బయో టెక్ ఫౌండర్ & చైర్మన్ అయిన కీ.శే శ్రీ దాట్ల రంగరాజు గారి కీర్తిని, గొప్పదనాన్ని స్మరించుకుని, ఆయనకు సంతాపం తెలియజేయుట కొరకు సంతాప సభను ఏర్పాటు చేసారు. సంతాప సభకు హాజరయిన సభ్యులందరు శ్రీ దాట్ల రంగ రాజు గారి చిత్ర పటానికి పూవులు సమర్పించి తమ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, మాజీ చైర్మన్ శ్రీ SVSS రామచంద్ర రాజు గారు, అల్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ మాజీ చైర్మన్ శ్రీ P రాఘవ రాజు గారు, డైరెక్టర్ శ్రీ MRK రాజు గారు, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ శ్రీ GSN రాజు గారు, శ్రీ KK రాజు గారు, శ్రీ K రామకృష్ణ రాజు గారు మొదలగు వారు కీ.శే శ్రీ దాట్ల రంగరాజు గారి తో తమకున్న పరిచయాన్ని, అనుబంధాలను తెలియజేస్తూ పలు విషయాలను తెలియజేసారు. వారు మాట్లాడుతూ... రంగ రాజు గారు సమయానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్ఛేవారని, సమయాన్ని చక్కగా పాటించేవారని ఆయనను చూసి మన గడియారం సమయాన్ని సరిచేసుకోవచ్చు అని అన్నారు. రంగ రాజు గారిని చూస్తేనే ఒక గౌరవ భావం ఏర్పడేదని, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించేవారని అన్నారు. వ్యవసాయం అంటే ఎంతో మక్కువ అని పేరీ గ్రూప్ లోను, నాగార్జున ఫెర్టిలైజర్స్ లోను కొంతకాలం ఉన్నతమైన ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసారని తర్వాత విజయనగర్ బయోటెక్ కంపెనీ స్థాపించి ఎంతో అనుభవమున్న పారిశ్రామిక వేత్తలు సైతం విస్తుబోయేలా ఉన్నత శిఖరాలను చేరుకున్నారని అన్నారు. అయన కృషి, పట్టుదల, హార్డ్ వర్క్, తెలివితేటలతో ఇన్ని విజయాలు సాధించారని అన్నారు. కీ. శే . శ్రీ దాట్ల రంగ రాజు గారు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితికి ఎనలేని సేవలందించారని చాల కాలం నుంచి సమితి నిర్వహించే ప్రతి కార్యక్రమం లో పాల్గొని తమ వంతు ఆర్థిక సాయం చేసేవారని, సమితికి డైరెక్టర్ గా, చైర్మన్ గా ఎనలేని సేవలందించారని అన్నారు. చాలామంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు. దాట్ల రంగ రాజు గారి ముగ్గురు కుమారులు తిరుపతి రాజు గారు, రాఘవ రాజు గారు, వివేకానంద రాజు గారు వారు కూడా చాల ఉన్నతమైన భావాలు కలవారని, వారి తండ్రి గారు చేపట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నామని అన్నారు. చివరిగా శ్రీ దాట్ల రంగ రాజుగారి పెద్ద కుమారుడు క్షత్రియ సంక్షేమ సమితి అద్యక్షులు అయిన శ్రీ దాట్ల తిరుపతి రాజు (శివాజీ ) గారు మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి మా నాన్న గారి సంతాప సభలో పాల్గొన్న అందరకీ ధన్యవాదాలు అని అన్నారు. మా నాన్న గారి గురించి మాకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలియజేసారని అన్నారు. మా కంపెనీ విషయంలో గానీ, వ్యాపార విషయాలలో గానీ మొదటినుంచి కూడా మా నాన్న గారు డే టు డే, మినిట్ టు మినిట్ గైడెన్స్ ఇచ్చేవారని, ప్రతి విషయం లోనూ చక్కని ప్లాన్తో ఉండేవారని అన్నారు. నాన్న గారు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేసేవారని అయినా ఒక్కసారి కూడా ఇంట్లో మాకు ఎవరికీ చెప్పేవారు కాదని తర్వాత ఎవరో చెపితే తెలిసేదని అంత గుప్తంగా సహాయం చేసేవారని అన్నారు. నాన్న గారు లేకపోవడం తీరని లోటే అయినప్పటికీ వారి సిద్ధాంతాలను, వారి సేవలను కొనసాగించడం ద్వారా ముందుకు సాగుతామని అన్నారు. ఈ నాటి కార్యక్రమం లో క్షత్రియ సంక్షేమ సమితి డైరెక్టర్స్, కమిటీ సభ్యులు, ఇతర క్షత్రియ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
ASR Vardhanthi
07 May 2024
దేశమాత రక్షణకు ప్రాణమిచ్చి పోరాడిన క్షత్రియ తేజం, యావత్ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన విప్లవ వీరకిశోరం శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి వర్ధంతి సందర్బంగా 07-05-2024 మంగళవారం ఉదయం విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు సీతమ్మధార జంక్షన్ లో ఉన్న సీతారామ రాజు గారి విగ్రహానికి, బీచ్ రోడ్ లో ఉన్న సీతారామ రాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతిరాజు గారు (శివాజీ), FKSS చైర్మన్ శ్రీ Ch. వెంకటపతిరాజు గారు (పెదబాబు) మొదలగువారు KD పేటలో జరిపిన వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొనుటకు KD పేట వెళ్లడం జరిగింది. విశాఖపట్నం లో జరిగిన ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, ట్రెజరర్ శ్రీ K శ్రీహరి రాజు గారు, సమితి కమిటీ సభ్యులు KVBS నాగరాజు గారు, శ్రీ D. సీతారామ రాజు గారు మొదలగువారు మరియు శ్రీ DV రామ రాజు గారు, డా. రామచంద్ర రాజు గారు మొదలగు క్షత్రియ పెద్దలు పాల్గొన్నారు. వర్ధంతి సందర్బంగా ఆ రోజు చలివేంద్రం ఏర్పాటుచేసి 100 లీటర్ల మజ్జిగ ను పంపిణీ చేయడం జరిగింది.
PVG Raju Jayanthi
05 May 2024
విజయనగర రాజ వంశీయులు, సంస్థానాధీశులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వేల ఎకరాల భూమిని దానం చేసిన మహనీయులు శ్రీ పూసపాటి విజయరామ గజపతి రాజు ( PVG రాజు ) గారి శత జయంతి సందర్బంగా 01-05-2024, బుధవారం ఉదయం 9.00 గంటలకు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి PVG రాజు గారి యొక్క గొప్ప మహనీయతను, దాన గుణాన్ని మననం చేసుకుని శత జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, ట్రెజరర్ శ్రీ K శ్రీహరి రాజు గారు డైరెక్టర్స్ శ్రీ MRK రాజు గారు, శ్రీ DS వర్మ గారు, స్పెషల్ ఇన్వైటీ శ్రీ జి. విక్రమాదిత్య వర్మ గారు, కమిటీ సభ్యులు శ్రీ KVBS నాగ రాజు (సెక్యూరిటీ శ్రీను) గారు, శ్రీ PAVS సత్యనారాయణ రాజు గారు, శ్రీ D సీతారామ రాజు గారు ఇంకా ఇతర క్షత్రియ సభ్యులు మరియు PVG రాజు గారి సన్నిహిత కుటుంబ సభ్యులైన శ్రీ అనిల్ వర్మ గారు, శ్రీ సునీల్ వర్మ గారు పాల్గొన్నారు.
Sri Rama Navami Celebrations
17 April 2024
17-04-2024వ తేదీ బుధవారం నాడు విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి క్షత్రియ కళ్యాణమండపంలో 'శ్రీరామ నవమి' వేడుకలు అత్యంత వైభవముగా జరిగినవి. ప్రతి సంవత్సరం KK రాజు గారు మరియు వారి ఫ్రెండ్స్ అందరు కలిపి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరుపుతున్నారు. ఈ సంవత్సరం కూడా క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ వేడుకను కన్నులపండుగగా జరిపారు. నెడ్ క్యాప్ చైర్మన్, క్షత్రియ సంక్షేమ సమితి డైరెక్టర్స్ బోర్డులో స్పెషల్ ఇన్వైటీ అయిన శ్రీ KK రాజు గారు వారి సతీమణి శ్రీమతి సుమ గారు, మరియు శ్రీ CS వర్మ గారు ( సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారి అల్లుడు గారు ) వారి సతీమణి శ్రీమతి దివ్య గారు కంకణదారులై పచ్చని తోరణాల మధ్య ముత్యాల తలంబ్రాలతో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారామ కళ్యాణ వేడుకను భద్రాచల మహోత్సవాన్ని తలపించేవిదంగా వేదపండితులతో అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ వేడుకను జరిపారు. సమితి వైస్ ప్రెసిడెంట్ శ్రీ N శ్రీనివాస రాజు గారు (కోడూరుపాడు) ఎంతో శ్రద్ధతో దగ్గరుండి ఈ కళ్యాణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు ప్రతి సంవత్సరం 'శ్రీరామ నవమి' నాడు విశాఖపురవాసులకు సాక్షాత్తూ స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని వీక్షించే మహదావకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ D తిరుపతి రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ ALN రాజు గారు, శ్రీ N శ్రీనివాస రాజు గారు (కోడూరుపాడు), జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు) మొదలగు కమిటీ సభ్యులు, శ్రీ MRK రాజు గారు, శ్రీ DS వర్మ గారు, శ్రీ GVV హరి వర్మ గారు మొదలగు డైరెక్టర్స్, ఇంకా క్షత్రియ యూత్ సభ్యులు, క్షత్రియ మహిళలు, క్షత్రియ పెద్దలు, అనేక మంది క్షత్రియేతరులు కలిపి 1200 మందికి పైగా పాల్గొని ఈ సీతారామ కల్యాణాన్ని తిలకించారు. వఛ్చిన వారందరకీ ప్రసాదంతో పాటు లంచ్ కూడా ఏర్పాటు చేసారు. క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు (శివాజీ) ప్రసాదం, లంచ్ స్పాన్సర్ చేసారు. విశాఖపట్నం క్షత్రియ కళ్యాణమండపం వేదికగా ఈ వేడుకను శ్రీ నడింపల్లి శ్రీనివాస రాజు గారి సహకారంతో జరిపిస్తున్న దాతలకు క్షత్రియ సంక్షేమ సమితి సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు అభినందనలు తెలియజేసారు.
Sri Krothi Nama Samvatsara Ugadi Celebrations
9 April 2024
విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితి వారు 09-04-2024 వ తేదీ మంగళవారం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిపారు. బ్రహ్మ దేవుడు తన సృష్టి ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాదిని తెలుగు వారందరూ అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో కుటుంబ సమేతంగా జరుపుకొనుట మన ఆచారము. చైత్రమాసం శుక్ల పక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజు ఉగాది పండుగ పర్వదినం. ఈ పర్వదినం రోజున గోపూజ, తులసిపూజ, పంచాంగ శ్రవణం చేస్తే సంపద, ఆయుష్షు, పాపప్రక్షాళన, వ్యాధినివారణ, గంగ స్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు. ఈ పర్వదినం రోజున విశాఖపట్నం క్షత్రియ సంక్షేమ సమితిలో లక్ష్మీ నారాయణ పూజ, తులసి పూజ, గోపూజ జరిపారు. క్షత్రియ సంక్షేమ సమితి ట్రెజరర్ శ్రీ కంకిపాటి శ్రీహరి రాజు గారు వారి సతీమణి శ్రీమతి రామసీత గారు దంపతులు పీటలమీద కూర్చొని శాస్త్రోక్తంగా పూజలు చేయడం జరిగింది. అనంతరం శ్రీ వారణాసి వెంకటేశ్వర శర్మ గారిచే గారిచే " పంచాంగ శ్రవణం " జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది వరకు క్షత్రియులు హాజరయినారు. క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దాట్ల తిరుపతి రాజు గారు, చైర్మన్ శ్రీ MSN రాజు గారు, సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ALN రాజు గారు (బుల్లిబాబు), శ్రీ N శ్రీనివాస రాజు గారు (కోడూరుపాడు), జాయింట్ సెక్రటరీ శ్రీ PVK హనుమాన్ రాజు గారు (అంజిబాబు), నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ KK రాజుగారు, మాజీ MLA శ్రీ P విష్ణుకుమార్ రాజు గారు, విశాఖపట్నం 14వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ K అనిల్ కుమార్ రాజు గారు, డైరెక్టర్స్ DS వర్మ గారు మొదలైన వారు, కమిటీ సభ్యులు ఇంకా ఇతర క్షత్రియ పెద్దలు, క్షత్రియ మహిళలు, క్షత్రియ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులందరకు ఉగాది పచ్చడి మరియు మధ్యాహ్నం లంచ్ ఏర్పాటుచేయడమైనది. ఉగాది మహోత్సవానికి విచ్చేసిన క్షత్రియ సోదర, సోదరీమణులందరికి సెక్రటరీ శ్రీ DSP వర్మ గారు ధన్యవాదాలు తెలియజేసారు.























































